Begin typing your search above and press return to search.

ఏమి సుడి కుమారా నీది !

By:  Tupaki Desk   |   19 May 2018 4:36 PM GMT
ఏమి సుడి కుమారా నీది !
X
క‌ర్ణాట‌క క‌థ సుఖాంతం అయ్యింది. అదెలా చెప్తారు ఒక వ‌ర్గానికే క‌దా సంతోషం అంటారా... లెక్క‌లు వేసుకుని చూసిన‌పుడు, కోర్టు న్యాయం ప్ర‌కారం ఆలోచించిన‌పుడు క‌చ్చితంగా క‌థ సుఖాంతం అనే అనాలి. మెజారిటీ ప్రేక్ష‌కులు కూడా అలాగే ఫీల‌య్యారు క‌దా మ‌రి! అయితే, చ‌రిత్ర‌లో ముఖ్యంగా కాంగ్రెస్ చ‌రిత్ర‌లో ఇదో అనూహ్య ఘ‌ట‌న‌. ఎందుకంటే... కాంగ్రెస్ పార్టీకి అత్య‌ధిక సీట్లు వ‌చ్చినా సీఎం సీటు ఇంకొక‌రికి త్యాగం చేయ‌డం ఒక సంచ‌ల‌నం అయితే, బేష‌రుతుగా త్యాగం చేయ‌డం ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించే వారికి ఇది ఒక షాకింగ్‌లా అనిపించింది.

కానీ... ఇంత‌కు మించిన చ‌రిత్ర జేడీఎస్‌ ది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను విశ్లేషించిన‌పుడు కొన్ని విచిత్ర‌మ‌యిన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. బ‌హుశా ఇందులో అనేక అరుదైన ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. వాటిని ఒక‌సారి ప‌రిశీలిస్తే... షాకులు త‌ప్ప‌వు. మొత్తం క‌ర్ణాట‌క‌లో 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వాటిలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. బెంగ‌ళూరు అర్బ‌న్‌ లో న‌కిలీ ఓట‌రు కార్డుల వ‌ల్ల ఒక సీటు - మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థి చ‌నిపోవ‌డం వ‌ల్ల ఒక సీటుకు ఎన్నిక‌లు వాయిదా ప‌డ్డాయి. ఇక మిగిలిన 222 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. జన‌తా ద‌ళ్ (సెక్యుల‌ర్‌) పార్టీకి 38 సీట్లు ద‌క్కాయి. అయితే - ఆ పార్టీ సీఎం అభ్య‌ర్థి అయిన కుమార‌స్వామి రెండు స్థానాల్లోనూ గెల‌వ‌డంతో సాంకేతికంగా వారికి 37 సీట్లే వ‌చ్చిన‌ట్లు లెక్క‌వేయాలి. ఎందుకంటే ఒక‌చోట ఆయ‌న రాజీనామా చేయాల్సి ఉంటుంది.

మ‌రి 222లో మిగ‌తా 38 స్థానాలు పోగా 184 స్థానాల్లో జేడీఎస్ పార్టీకి ఎలాంటి ఫ‌లితాలు ద‌క్కాయ‌నేది ఇక్క‌డ ఆస‌క్తిక‌రం. ఒక‌ప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ విచిత్రంగా 147 స్థానాల్లో అస‌లు డిపాజ‌ట్ల‌నే కోల్పోయింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ఎల‌క్ష‌న్ చ‌ట్టం ప్ర‌కారం 5-10 వేలు డిపాజిట్ (కులాన్ని బ‌ట్టి) చేయాల్సి ఉంటుంది. పోలై వాలిడ్ అయిన ఓట్ల‌లో ఆరో వంతు ఓట్లు కూడా రాని ప‌క్షంలో ఎన్నిక‌ల సంఘం ఆ అభ్య‌ర్థి డిపాజిట్‌ ను వెన‌క్కు ఇవ్వ‌దు. అంటే 147 నియోజ‌క‌వ‌ర్గాల్లో జేడీఎస్ క‌నీసం ఆరో వంతు మంది ఆద‌ర‌ణ కూడా పొంద‌లేదు. మిగ‌తా 37 స్థానాల్లో చాలా త‌క్కువ స్థానాల్లో మాత్ర‌మే అది రెండో ప్లేసులో ఉంది. రాష్ట్రం మొత్తం మీద పోలైన ఓట్ల‌లో కేవలం 18 శాతం ఓట్లు మాత్ర‌మే ఆ పార్టీ సంపాదించింది. అంటే రాష్ట్రంలో కేవ‌లం 18 శాతం మంది మాత్ర‌మే కుమార‌స్వామిని ముఖ్య‌మంత్రిగా చూడాల‌నుకున్నార‌ని చెప్పుకోవ‌చ్చు సాంకేతికంగా. ఇందులో మ‌రో లెక్క ఏంటంటే... రాష్ట్రంలోని 25 జిల్లాల్లోనూ ప్ర‌తి జిల్లా నుంచి బీజేపీ నుంచి ఎంపిక‌యిన ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ 11 జిల్లాల్లో జేడీఎస్‌ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు.

ఇన్ని దుర‌దృష్టాల్లో కూడా కాంగ్రెస్ అవ‌స‌రాలు - మోడీ రాజ‌కీయం- నేప‌థ్యంలో అతి తక్కువ సీట్లతో సీఎం సీట్లో కూర్చోబోతున్నారు జేడీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు అయిన కుమార‌స్వామి. ఇది క‌చ్చితంగా అదృష్టం అనే చెప్పాలి. ఏం కుమార‌న్నా హ్యాపీయే క‌దా! (కుమార‌న్న అనేది కుమార‌స్వామికి రాష్ట్రంలో ముద్దుపేరు).