Begin typing your search above and press return to search.

త‌న సీఎం పీఠం పోయేందుకు కార‌ణ‌మైన వ్య‌క్తికి కుమార‌స్వామి స‌ర్‌ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   25 July 2019 1:08 PM GMT
త‌న సీఎం పీఠం పోయేందుకు కార‌ణ‌మైన వ్య‌క్తికి కుమార‌స్వామి స‌ర్‌ ప్రైజ్‌
X
తన‌ ప్రభుత్వ పతనం అనంత‌రం జేడీఎస్ నేత‌ - మాజీ సీఎం కుమారస్వామి ఆస‌క్తిక‌ర రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ సురేశ్ కుమార్ ఇంకా నిర్ణయం తీసుకోని నేప‌థ్యంలో కుమార‌స్వామి అస‌లు స‌మ‌స్య మొద‌లైన ద‌గ్గరి నుంచే ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క కాంగ్రెస్‌లో మొద‌ట‌గా తిరుగుబాటును తీసుకొచ్చిన ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి ఇంటికి వెళ్లారు. బెంగ‌ళూరు ల‌క్క‌సంద్ర‌లోని రామలింగారెడ్డికి వెళ్లిన ఆయ‌న అక్క‌డే అల్పాహారం తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో రామ‌లింగారెడ్డి కుమార్తె జ‌య‌న‌గ‌ర ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి అక్క‌డే ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి స‌మావేశం జ‌రిగింది. స‌హ‌జంగానే ఈ స‌మావేశం హాట్ టాపిక్‌ గా మారింది.

బెంగ‌ళూరులోని బీటీఎం లే అవుట్ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రామ‌లింగారెడ్డి ప్ర‌భుత్వంలో సంక్షోభం క‌లిగించేందుకు కార‌ణంగా మారారు. సీఎం కుమార‌స్వామి విధానాలు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్ల త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు రామ‌లింగారెడ్డి ప్ర‌క‌టించారు. దీంతో అప్ప‌టికే అసంతృప్తితో ఉన్న మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు సైతం ఆయ‌న బాట‌లోనే రాజీనామా చేశారు. అయితే, పార్టీ పెద్ద‌ల జోక్యంతో రాజీనామా వెన‌క్కు త‌గ్గారు. కానీ... మిగ‌తా ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాల‌ను వెన‌క్కి తీసుకోవడానికి నో చెప్పారు. దీంతో ఆ వివాదం కొనసాగి కుమార ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది.

ఇలా, కల‌క‌లానికి కార‌ణ‌మైన రామ‌లింగారెడ్డి ఇంటికి స్వ‌యంగా కుమార‌స్వామి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బ్రేక్‌ ఫాస్ట్ సైతం అక్క‌డే చేసి వివిధ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. అయితే ఈ స‌మావేశం గురించి తెలిసిన మీడియా అక్క‌డికి వెళ్లి కుమార‌స్వామి అభిప్రాయం కోరింది. ఈ స‌మావేశం వెనుక రాజ‌కీయ ప్రాధాన్యం లేద‌న్న కుమార‌స్వామి మ‌ర్యాద‌పూర్వ‌కంగానే స‌మావేశ‌మ‌య్యామ‌ని తెలిపారు. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావించ‌గా....ఇప్పుడే తాను స్పందించ‌డం స‌రికాద‌ని తెలిపారు.

ఇదిలాఉండ‌గా బుధ‌వారం కుమార‌స్వామి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జేడీఎస్ ఎల్పీ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన కుమార‌స్వామి త‌న పాల‌న‌పై స్పందించేందుకు నో చెప్పారు. కాంగ్రె స్ నేతలు ఒప్పుకుంటే వారితో చేతులు కలుపుతామని - లేదంటే సొంతంగా వ్యవహరిస్తామన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు - సీఎల్పీ నేత సిద్దరామయ్య - డిప్యూటీ సీఎం పరమేశ్వర భేటీ అయ్యాన‌ని వివ‌రించారు.