Begin typing your search above and press return to search.
వాకింగ్ కోసం లగ్జరీ హోటల్లో సీఎం!
By: Tupaki Desk | 28 Jan 2019 10:58 AM GMTవాకింగ్ చేయాలంటే ఏం చేయాలి? పార్కుకు వెళ్లాలి. లేదంటే.. పొద్దున్నే వీధిలో నడిస్తే సరిపోతుంది. నగరంలోనూ.. చిన్నసైజు అపార్ట్ మెంట్ అయితే.. కారిడార్లో నడిచినా సరిపోతుంది. ఇదేమీ కాదంటే.. టాప్ రూఫ్ మీద నడిస్తే సరిపోతుంది. ఇది సామాన్యులకు వర్తిస్తుంది. మరి.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే..?
సీఎం అయితేనేం.. చేసేది వాకింగేగా? అన్న క్వశ్చన్ వద్దు. ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తున్నారా? ఆయన సహజంగానే స్పోర్ట్స్ పర్సన్. నేతగానూ.. సీఎంగానూ ఆయన కేబీఆర్ పార్క్ లో సీరియస్ గా వాకింగ్ చేసేవారు. కానీ.. అలాంటివి ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామికి వర్తించవు. ఎందుకంటే.. బెంగళూరు మహానగరంలో ఆయన వాకింగ్ చేయటానికి ఎంచుకున్న ప్లేస్ తెలిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. గార్డెన్ సిటీలో ఆయన వాకింగ్ కు అనువుగా ఉండేది ఖరీదైన ఒక లగ్జరీ హోటల్ మాత్రమేనట.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. అధికార కార్యాలయాన్ని వదిలేసి లగ్జరీ హోటల్లో ఉండటం ఏమిటంటూ విపక్ష నేతలు విరుచుకుపడుతున్న వేళ.. కుమారస్వామి రియాక్ట్ అయ్యారు. అరే.. లగ్జరీ హోటల్లో ఎందుకు ఉన్నానో తెలుసా? నా ఆరోగ్యం కోసం. వాకింగ్ చేయటానికి వీలుగా ఉంటుందని స్టార్ హోటల్లో ఉన్నట్లు చెప్పారు. అయితే.. తానేమీ ప్రజాధనాన్ని వృధా చేయటం లేదన్న ఆయన.. తన సొంత డబ్బులతోనే ఖర్చు చేస్తున్నానని.. దానికి తప్పు పడతారా? అంటూ ఫైర్ అవుతున్నారు.
ఆరోగ్యం రీత్యా తాను ఒక గంట పాటు మార్నింగ్ వాక్ చేయాలని.. అందుకు రోడ్ల మీదా.. పార్కు ల్లోనూ వీలు కాదని.. అందుకే లగ్జరీ హోటల్ ను ఎంచుకున్నట్లు చెప్పారు. హోటల్లో ఉండటానికి సొంత డబ్బులు ఖర్చు చేస్తుంటే బీజేపీ నేతలకు ఏం ఇబ్బంది? ఆ మాటకు వస్తే.. ఢిల్లీకి వెళ్లే సందర్భంలో మీరు ఉండే హోటళ్ల ఖర్చు మాటేమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
తాను తన పర్సనల్ వాకింగ్ కోసమే హోటల్లో ఉంటున్నానే కానీ.. మంత్రుల్ని.. పార్టీ ఎమ్మెల్యేలను కలుసుకోవటానికి.. ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఆఫీసునే వినియోగిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కుమారస్వామి పూర్తిగా తెలుసుకోలేదేమో? సెక్రటేరియట్ కు రాకుండా ఒక టర్మ్ ను విజయవంతంగా పూర్తి చేసి రెండో టర్మ్ లోనూ అదే తీరును సాగిస్తున్నారు. అలాంటి ఆయన్ను ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు. ఆ కిటుకు ఏమిటో కేసీఆర్ ను కుమారస్వామి తెలుసుకుంటే.. తనపై వచ్చే విమర్శలకు అదే పనిగా రియాక్ట్ కావాల్సిన అవసరమే ఉండదు.