Begin typing your search above and press return to search.
పేపర్ చదివి బుక్ అయిన ఆ రాష్ట్ర సీఎం
By: Tupaki Desk | 22 Aug 2018 5:07 AM GMTసోషల్ మీడియా యమా యాక్టివ్ గా మారిన వేళ.. ఏ చిన్న విషయమైనా ఇట్టే బయటకు వచ్చేస్తుంది. అయితే.. అలా వచ్చిన అంశాల్లో చాలావరకూ అస్పష్టంగా.. అసమ్రగంగా.. కల్పితాలతో ఉండటం ఇబ్బందికరంగా మారింది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.
ఇటీవల భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని కొడుగు జిల్లా దారుణంగా డ్యామేజ్ అయ్యింది. దీంతో.. జరిగిన నష్టంపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే కోసం విమానం ఎక్కిన ముఖ్యమంత్రి ఎంచక్కా పేపర్ చదువుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఓపక్క భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వేకు వెళ్లిన ముఖ్యమంత్రి ఇలా పేపర్ చదవటం ఎందుకు? పేపర్ చదవటానికే అయితే.. ఏరియల్ సర్వేకు వెళ్లటం ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యమంత్రి పేపర్ చదువుతున్న వైరల్ వీడియోలో నిజం ఎంతన్నది చూసినప్పుడు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. ఈ నెల 19న నిర్వహించిన ఏరియల్ సర్వేలో కుమారస్వామితో పాటు.. పలువురు అధికారులు.. రక్షణ సిబ్బంది ఉన్నారు. సీఎం కార్యాలయానికి సంబంధించిన సిబ్బందిలో ఒకరు ఈ వీడియోను చిత్రీకరించారు. వరద ప్రభావిత ప్రాంతానికి చేరుకునేందుకు కాస్త సమయం పట్టటం.. ఆలోపు ఖాళీగా ఉండకుండా ముఖ్యమంత్రి కుమారస్వామి.. పేపర్లను చదివే పనిలో పడ్డారు. ఏరియల్ సర్వే అంటే.. విమానం ఎక్కింది మొదలు అద్దంలో చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు కదా? అయితే..ప్రతి విషయాన్ని ఏదో రకంగా సంచలనం చేసే బాపతులోనే.. తాజా వీడియో అని చెబుతున్నారు.