Begin typing your search above and press return to search.

తనయుడి విజయావకాశాలపై సీఎం సమీక్ష - ఓటమి తప్పదా!

By:  Tupaki Desk   |   28 April 2019 2:30 PM GMT
తనయుడి విజయావకాశాలపై సీఎం సమీక్ష - ఓటమి తప్పదా!
X
మండ్య నుంచి తన తనయుడు నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించిన కర్ణాటక సీఎం కుమారస్వామి ఇప్పుడు బాగా అసహనంతో ఉన్నారట. ప్రత్యేకించి ఇటీవలే అక్కడ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిపై సమీక్ష నిర్వహించిన కుమారస్వామి.. పార్టీ నేతలపై ఫైర్ అయ్యారట. అనుకున్న స్థాయిలో నిఖిల్ కోసం ఓట్లు వేయించలేకపోయారని కుమారస్వామి పార్టీ నేతలపై గరం అయినట్టుగా సమాచారం.

మామూలుగానే మండ్య జేడీఎస్ కు అనుకూలమైన ప్రాంతం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలతో కూడా ఆ విషయంపై స్పష్టత వచ్చింది. ఆ ధీమాతోనే కుమారస్వామి అక్కడ తన తనయుడిని పోటీ చేయించారు. సుమలత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగడంతో అక్కడ జేడీఎస్ లెక్కలు తప్పాయి.

ఈ నేపథ్యంలో పోలింగ్ అనంతర సమీక్షలో కుమారస్వామి తమ వాళ్ల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తన తనయుడి విజయం కోసం వారంతా సరిగా పని చేయలేదని కుమారస్వామి వారి మీద ఎగిరారరట. అంతే కాదు..అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా తన తనయుడి విజయం కోసం సరిగా పని చేయలేదని - పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కుమారస్వామి అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

ఇలా తనయుడి విజయం మీద అపనమ్మకంతో పార్టీ నేతలపై కుమారస్వామి ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. మరి తను సీఎం సీట్లో కూర్చుని తనయుడు ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే..కుమారస్వామికి అది పెద్ద అవమానమే అవుతుంది. మరి అసలు కథ ఏమిటే మే ఇరవై మూడున తెలియాల్సిందే!