Begin typing your search above and press return to search.

కుమార స్వామి కొడుకు పెళ్లి ఫిక్స్ ..అమ్మాయి ఎవరంటే ?

By:  Tupaki Desk   |   27 Jan 2020 9:14 AM GMT
కుమార స్వామి కొడుకు పెళ్లి  ఫిక్స్ ..అమ్మాయి ఎవరంటే ?
X
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అతి త్వరలో పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడిగా మారబోతున్నాడు. త‌మ స‌మీప బంధువుల అమ్మాయినే నిఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని సమాచారం. త‌న త‌ల్లి త‌ర‌ఫు బంధువుల అమ్మాయిని నిఖిల్ పెళ్లి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయి కుటుంబం జేడీఎస్ రాజ‌కీయాల్లో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఇలా సొంత పార్టీలో ఉన్న‌, బంధువుల కుటుంబానికి చెందిన అమ్మాయిని నిఖిల్ పెళ్లి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఇకపోతే మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. జాగ్వార్ అనే సినిమాతో నిఖిల్ హీరోగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాని క‌న్న‌డ‌తో పాటు తెలుగులో కూడా తెరకెక్కించారు. అయితే నిఖిల్ మొదటి సినిమా అభిమానులని అంతగా ఆక‌ట్టుకో లేక‌పోయింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌ లో ఒక‌టీ అర సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయన కి పెద్దగా కలిసి రాలేదు. అలాగే నిఖిల్ కొన్ని రోజుల ముందు వచ్చిన మ‌హా భార‌త సినిమాలో అభిమ‌న్యుడి రోల్ నటించి మంచి నటన కనబరిచాడు.

కాగా, గ‌తంలో నిఖిల్ ఒక తెలుగ‌మ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. కుమార‌ స్వామి సీఎంగా ఉన్న‌ప్పుడు రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపార కుటుంబంతో వియ్య‌మంద‌నున్నార‌ని వార్త‌లు వచ్చినప్పటికీ కూడా ఆ వార్తలు పుకార్లాగానే మిగిలి పోయాయి. తాజాగా ఇప్పుడు నిఖిల్ బంధుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతునట్టుగా వార్తలు వెలువడంతో అయన అభిమానులు ఆనందంలో మునిగి పోయారు. త్వరలోనే వీరి పెళ్లి డేట్ ని కుమారస్వామి స్వయంగా ప్రకటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.