Begin typing your search above and press return to search.
నా దగ్గర నీ గుట్టుంది.. జాగ్రత్త: డీకే శివకుమార్‌కు కుమారస్వామి వార్నింగ్
By: Tupaki Desk | 5 July 2023 11:16 PM GMTకర్ణాటక లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పై తాజాగా విపక్ష జేడీఎస్ నాయకుడు, మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయి లో నిప్పులు చెరిగారు. అవినీతి ఎవరు చేశారో.. నా దగ్గర అంతా రికార్డు ఉందంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. గతం లో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయం లో 2018-19 మధ్య ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన అవినీతి మొత్తం తన దగ్గర పెన్‌డ్రైవ్ రూపం లో ఉందంటూ.. ఆయన దాని ని చూపించారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రగిలింది.
అసలు ఏం జరిగిందంటే..
మాజీ సీఎం కుమారస్వామి అవినీతిపరుడంటూ.. ప్రస్తుత కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. 2018-2019 మధ్యకాలం లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ ను తన అక్రమాల కు అడ్డాగా వాడుకున్నారని కుమారస్వామి పై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో కుమార స్వామి ఎదురు దాడి చేశౄరు. తన పై చేసిన ఆరోపణల ను తిప్పికొట్టారు. ఎవరు, ఎలాంటి అక్రమాల కు పాల్పడ్డారనే చిట్టా తన వద్ద ఉందని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలన్నీ తన వద్దే ఉన్నాయని స్పష్టం చేశారు.
వాటన్నింటినీ తాను ఈ పెన్ డ్రైవ్ లో దాచి పెట్టానని కుమారస్వామి చెప్పారు. తాజాగా మీడియా తో మాట్లాడిన ఆయన తన జేబు లో ఉన్న ఓ పెన్ డ్రైవ్ ను తీసి చూపించారు. దీన్ని ఎప్పుడూ తన పాకెట్ లోనే పెట్టుకుని తిరుగుతుంటానని, ఏక్షణమైనా దీన్ని బయటపెడతానని బాంబు పేల్చారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇదివరకు తన కేబినెట్ లో మంత్రిగా పని చేశారని, అధికారుల ను బదిలీ చేయడానికి పెద్ద ఎత్తునలంచాల ను తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక బాధ్యత గల మంత్రిగా.. అధికారుల ను బదిలీ చేసే విషయంలో ఎందుకులంచాల ను తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆధారల తో సహా కాంగ్రెస్ నేతల అవినీతిని బయటపెడతాన ని హెచ్చరించారు.."నేను సాక్ష్యాల ను జేబు లో పెట్టుకుని తిరుగుతున్నా. ఎప్పుడైనా దాన్ని బయట కు రిలీజ్ చేస్తాను. సరైన సమాచారం లేకుండా నేను ఏదీ కూడా విడుదల చేయను. ఆఫీసర్ల పోస్టింగ్‌ల కోసం బాధ్యత కలిగిన మంత్రి ఎలా డబ్బులు తీసుకుంటారు? అదంతా ఇందులో ఉంది'' అంటూ ఓ పెన్‌డ్రైవ్ ను ఆయన జేబు లో నుంచి తీసి చూపించారు.
దీనికి ముందు, కుమారస్వామి గతం లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధ్యత కలిగిన విపక్ష పార్టీగా తాము ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాల పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిలదీస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ను కాంగ్రెస్ పార్టీ అనుమతించడం పై నా ఆయన విమర్శలు గుప్పించారు.