Begin typing your search above and press return to search.
ఎర్రజెండాలకు గొప్ప ఆఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 10 July 2016 7:57 AM GMTతెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఆసక్తికరమైన ఆఫర్ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఎర్ర జెండాను పట్టుకొని రోడ్డెక్కిన ఆశావర్కర్ల ముందు విప్ కొత్త ప్రతిపాదన ఉంచారు. ఎర్రజెండాలను వదిలేయాలని - అపుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో 30 పడకల ఆస్పత్రిలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని విప్ రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు తాము వెట్టి చాకిరి చేస్తున్నామని, గౌరవ వేతనాలు పెంచాలని కోరారు. దీనిపై విప్ స్పందిస్తూ.. ఆశావర్కర్లకు రూ.150 ఉన్న గౌరవ వేతనాన్ని రూ.300కు పెంచామని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే నేరుగా ఎమ్మెల్యేలు - సంబంధిత అధికారులకు తెలియజేయాలి గానీ, ఇలా ఎర్ర జెండాను పట్టుకుని రోడ్డెక్కితే వేతనాలు పెరగవన్నారు. సీఐటీయూను వదిలేసి - రోడ్డెక్కకుండా సమస్యల పరిష్కారం కోరితే అప్పుడు స్పందిస్తామని స్పష్టం చేశారు. గతంలో అంగన్వాడీలను ఉద్దేశించీ రవికుమార్ ఇలాంటి వ్యాఖ్యలతోనే విరుచుకుపడ్డారు. సీఐటీయూలో ఉంటే తాట తీసి - ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. తాజాగా మరోమారు అదే తరహా వ్యాఖ్యలు చేయడంపై ఎర్రన్నలు సహజంగానే మండిపడుతున్నారు.