Begin typing your search above and press return to search.
కుప్పం షాక్ జగన్ కే... బాబుకు అమిత్ షా సపోర్టు...?
By: Tupaki Desk | 26 Aug 2022 8:30 AM GMTఏపీ రాజకీయాలు మారుతున్నాయి. ఈ విషయం బయటకు తెలిసే దాని కన్నా లోపల చాలానే ఉంది అంటున్నారు. కేంద్ర బీజేపీ పెద్దలు తమ మనసు మార్చుకున్నారు. తమకు అధికారం కావాలి. పైగా ఉత్తరాదిన ఈసారి కావాల్సిన సీట్లు కొరతా పడతాయని స్పష్టంగా తెలుస్తున్న నేపధ్యంలో సౌత్ వైపు వారు ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాలు బీజేపీ పెద్దలకు సరికొత్త ఆశలను పెంచుతున్నాయి.
తెలంగాణాలో ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా బీజేపీ దూకుడు ఉంది. రెండు సార్లు గెలిచిన టీయారెస్ కి ఈసారి ఇక చాన్స్ లేదని బీజేపీ లెక్క. అందుకే అక్కడ అన్ని అవకాశాలు వాడేసుకుని తామే కొత్త సర్కార్ ఏర్పాటు చేయలనుకుంటోంది. దానికి నాందిగా అమిత్ షా తాజా టూర్ లో మీడియా దిగ్గజం రామోజీరావుని ప్రత్యేకంగా కలిశారు. ఆ వెంటనే జూనియర్ ఎన్టీయార్ తో మీట్ అయ్యారు. ఈ రెండూ కూడా ఇండైరెక్ట్ గా టీడీపీకి కలసివచ్చేవే అంటున్నారు.
ఇక ఏపీ వరకూ చూస్తే జగన్ విషయంలో ఎందుకో కేంద్ర పెద్దలకు మోజు తీరింది అనే అంటున్నారు. జగన్ తో ఎన్నికల పొత్తులకు కుదరదు, ఇక ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ గా కాదు, ఆయన అనుకున్నది చేయాలనుకుంటారు. మూడు రాజధానులతో మొదలెట్టి ఏపీ అప్పుల కధతో చాలా వరకూ దూకుడు చేసిన తీరుతో కేంద్ర పెద్దలకు జగన్ కి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అంటున్నారు.
ఇక 2024 ఎన్నికల్లో జగన్ మళ్ళీ వస్తారా రారా అన్న దాని మీద కూడా డౌట్లు ఉండి ఉంటాయి. ఒక వేళ జగన్ తిరిగి అధికారంలోకి వచ్చినా ఆయనకు కేసీయార్ తో ఉన్న దోస్తీ కారణంగా బీజేపీయేతర కూటమికి మద్దతు ఇస్తారేమో అన్న డౌట్లు కూడా ఉన్నాయట. మొత్తానికి జగన్ తో ఏ రకంగా చూసినా ఎన్నికల్లో పొత్తు రూపంలో సీట్లు రావు. ఇక ఎన్నికల తరువాత జగన్ మద్దతు బీజేపీలో కూడా మోడీ షా కాకుండా నితిన్ గడ్కరీ వారిమీద కూడా ఉంటుందన్న అపనమ్మకాలు ఉన్నాయట.
ఆ మధ్యన నితిన్ గడ్కరీ ఏపీకి వస్తే జగన్ స్వయంగా తన ఇంటికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేశారు. ఇలా జగన్ విషయంలో చాలా డౌట్లు పెట్టుకున్న బీజేపీ ఆయన కంటే బాబు బెటర్ అనుకుంటోందిట. బాబు అయితే అటు తెలంగాణా ఇటు ఏపీ రెండూ దున్నేయవచ్చు అన్నది మేజర్ పాయింట్. అంతే కాకుండా ఒక పవర్ ఫుల్ సామాజికవర్గం తమ వెంట వస్తుందని అంచనా కడుతోందిట.
అలాగే మీడియా మొగల్ అని చెప్పే బడా ఆసామి మద్దతు కూడా ఫుల్ గా దక్కుతుంది అని ఊహిస్తున్నారు. సినీ గ్లామర్ పరంగా చూసినా బాబు సైడ్ ఉంటేనే తమకు దక్కుతుంది అన్న లెక్కలు వేసుకునే బాబుని తమ వైపునకు తిప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు అని తెలుస్తోంది.
అందుకే కుప్పంలో బాబు టూర్ లో భద్రతాపరమైన లోటు పాట్లు ఉన్నాయని తెలియడంతో ఆయనకు హుటాహుటిన కేంద్రం భద్రతన్ 12 ప్లస్ 12గా పెంచేసింది. దీంతో బాబుకు ఢిల్లీ ఫుల్ సపోర్ట్ అనే అర్ధమవుతోంది అంటున్నారు. ఇదంతా ఆగమేఘాల మీద చకచకా జరిగిన పరిణామం. బాబు భద్రత మీదడీజీఐ నేతృత్వంలోని ఎన్ఎస్జీ బృందం చంద్రబాబు ఇంటిని, టీడీపీ ఆఫీసును పరిశీలించించింది. ఇక కేంద్రం సైతం ఆలస్యం చేయకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీని భారీగా పెంచేసి బాబుకు ఫుల్ హ్యాపీస్ అయ్యేలా చేసింది.
ఈ పరిణామాన్ని చూసిన వారు కుప్పంలో అసలైన షాక్ జగన్ కే తగిలింది అంటున్నారు. బాబుని అక్కడ బదనాం చేద్దమనుకుంటే ఆయన రెట్టింపు బలవంతుడిగా మారారు. అంతే కాదు ఆయనకు కేంద్రం తాము రక్షణగా ఉన్నామని చాటి చెప్పినట్లు అయింది. మరో వైపు ఇది రాజకీయంగా చూస్తే బాబు వర్సెస్ జగన్ ఫైట్ లో తాము బాబు పక్షమే అని కూడా క్లారిటీగా బీజేపీ పెద్దలు చెప్పారా అన్న చర్చ కూడా నడుస్తోంది.
టోటల్ గా చూస్తే కుప్పం ని ఒక శాంపిల్ గా తీసుకుంటే రేపటి రోజున ఏపీలో జరిగే అతి పెద్ద రాజకీయ యుద్ధంలో బాబుని వెన్నంటి కేంద్ర బీజేపీ ఉంటుందన్న స్పష్టమైన సందేశం కూడా పంపించినట్లు అయింది అంటున్నారు. మరి దీని మీద వైసీపీ ఏ విధంగా విశ్లేషించుకుంటుందో చూడాలి.