Begin typing your search above and press return to search.
కుప్పం బాబుకు ఎందుకు ఇంత పెద్ద షాకిచ్చింది?
By: Tupaki Desk | 18 Nov 2021 11:30 PM GMTచంద్రబాబునాయుడుకు కుప్పం ప్రజలు గుడ్ బై చెప్పినట్లేనా ? అవుననే అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు తీరుతో మిగిలిన రాష్ట్ర ప్రజల్లాగే కుప్పం జనాలు కూడా బాగా విసిగిపోయినట్లు సజ్జల చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీని ఓడించి చంద్రబాబును వదిలించుకున్న కుప్పం జనాలకు శుభాకాంక్షలు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు బైబై చెప్పిన జనాలు కుప్పంలో ఇపుడు గుడ్ బై చెప్పినట్లు సజ్జల సెటైర్లు వేశారు.
సరే సజ్జల చెప్పింది ఎంతవరకు కరెక్టనేది వేరే విషయం. క్షేత్రస్థాయిలో వాస్తవం అయితే టీడీపీ కోటకు పడిన బీటలు పెరిగాయనేది వాస్తవం. పంచాయితి ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారు. తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో వైసీపీ దాదాపు స్వీప్ చేసేసింది. తాజా ఎన్నికల్లో 25 వార్డులకు గాను ఏకంగా 19 చోట్ల అధికార పార్టీ గెలిచింది. గడచిన 30 ఏళ్లుగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో వైసీపీకి ఏకపక్షంగా ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయి ?
ఎందుకంటే కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు చాలా నిర్లక్ష్యం చేశారనేది వాస్తవం. దాదాపు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన నియోజకవర్గాన్ని చేయాల్సినంత స్ధాయిలో అభివృద్ధి చేయలేదన్నది నిజం. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నేతలెవరు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో స్ధానిక నేతలను మ్యానేజ్ చేయటం ద్వారా చంద్రబాబు తనకు కుప్పంలో ఎదురులేకుండా చేసుకున్నారు. తనకు ఎప్పటికీ ఎవరూ పోటీ రాకుండా ఉండాలని అనుకున్న చంద్రబాబు తన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునుండాల్సింది. ఇపుడు వైసీపీ గట్టి దృష్టి పెట్టడంతో అన్నీ ఓటములే ఎదురవుతున్నాయి.
అలాంటిది రోడ్లు సరిగా లేవు. ఉపాధి అవకాశాలు పెంచలేదు. ఉద్యోగవకాశాలనూ పెంచలేదు. పోనీ రాజకీయంగా నేతలందరినీ బలోపేతం చేశారా అంటే అదీలేదు. కేవలం నలుగురైదుగురి చేతికి నియోజకవర్గాన్ని అప్పగించేశారు. ఏ విషయంలో అయినా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. వాళ్ళ అవినీతి, అక్రమాల గురించి ఎంతమంది చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. దాంతో మొదటి దెబ్బ 2019 ఎన్నికల్లోనే పడింది.
కౌంటింగ్ సందర్భంగా మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనకబడటం సంచలనమైంది. చంద్రబాబు మొత్తానికి గెలిచినా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయినా చంద్రబాబు మేల్కోలేదు. ద్వితీయశ్రేణి నేతలు, క్యాడర్+మామూలు జనాలు బాగా వ్యతిరేకించే నేతలకే పార్టీ పగ్గాలు మళ్ళీ అప్పగించారు. ఇపుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలో కూడా మెజారిటి నేతలు, క్యాడర్, జనాలు తీవ్రంగా వ్యతిరేకించే కొద్దిమంది నేతలదే పెత్తనమట. దాంతో ఒళ్ళుమండిపోయిన మిగిలిన నేతలు, క్యాడర్+జనాలు చంద్రబాబుకు గుడ్ బై చెప్పినట్లున్నారు. మరి మున్సిపాలిటి మాత్రమే గుడ్ బై చెబుతారా ? లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చెబుతారా అన్నది చంద్రబాబు వైఖరిపైనే ఆధారపడుంటుంది.
ఇంకో కోణం ఏంటంటే... కుప్పం విషయంలో వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తన శక్తి సామర్థ్యాలు అన్నీ వాడింది. పైగా దొంగ ఓట్లు వేయించిందనే ఆరోపణలున్నాయి. అలాగే వెలువడిన ఫలితాల్లో కూడా తప్పులు ఉన్నాయని తెలుగుదేశం ఆరోపిస్తోంది. ఆధారాలు కూడా చూపిస్తోంది. ఇన్ని చేసినా కుప్పం మొత్తం వార్డుల మీద మెజారిటీ అన్నీ కలిపినా నాలుగు వేలు దాటలేదని విశ్లేషకులు చెబుతున్నారు.