Begin typing your search above and press return to search.

కుప్పం వ‌ర్సెస్ పులివెందుల‌.. అభివృద్దిలో ఏది ముందు?

By:  Tupaki Desk   |   27 Sep 2022 12:30 AM GMT
కుప్పం వ‌ర్సెస్ పులివెందుల‌.. అభివృద్దిలో ఏది ముందు?
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు.. తాజాగా ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం పై క‌న్నేసిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ గెలిచి తీరాల‌ని.. ఇక్క‌డ ఎట్టిప‌రిస్థితిలోనూ.. చంద్ర‌బాబును ఓడించాల‌ని.. క‌ల‌లుకంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ అబివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని.. 33 ఏళ్లుగా.. చంద్ర బాబు ఇక్క‌డ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా... ఇక్క‌డ ఎలాంటిపురోగ‌తిలేద‌ని.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.

ఇక‌, సీఎం జ‌గ‌న్‌కూడా కుప్పంలోతాము వ‌చ్చిన త‌ర్వాతే.. అభివృద్ధి జ‌రుగుతోంద‌ని.. మినీ మునిసిపాలి టీ చేశామ‌ని.. పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌నలు గుప్పించారు. 66 వేల కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థా ప‌నలు కూడా చేశారు. అయితే.. వాస్త‌వానికి చంద్ర‌బాబు 33 ఏళ్ల‌లో అస‌లు కుప్పాన్ని అభివృద్ధి చేయ‌లే దా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. ఏ నేత అయినా.. తొలిసారి కాక‌పోయినా.. రెండోసారి అయినా.. అభివృద్ధికి స‌మ‌యం ఇస్తారు క‌దా! ఇక‌, ప‌నిరాక్ష‌సుడిగా.. అభివృద్ధి మాంత్రికుడిగా పేరున్న‌.. చంద్ర‌బాబు కూడా.. అదే ప‌రంప‌ర‌లో ముందుకు సాగ‌కుండా ఉంటారా?

సాగారు! ఇక్క‌డ ర‌హ‌దారుల అభివృద్ధిచేశారు. మ‌హిళ‌ల‌ను స్వ‌యంస‌హాయ‌క సంఘాల్లో ప్రోత్స‌హిం చా రు. ఎంఎస్ ఎంఈల‌ను ప్రోత్స‌హించి.. యువ‌త‌కు అనేక అవ‌కాశాలు క‌ల్పించారు. ఫ‌లితంగా.. జీడీపీలో కుప్పం ముందు వ‌రుస‌లోఉంది. ఇదే విష‌యాన్ని టీడీపీ కూడా చెబుతోంది. ఇక‌, ఫ్యాక్ట‌రీలు తీసుకువ‌చ్చా రు. రైతుల‌ను ప్రోత్స‌హించారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా.. ఆత్మ‌హ‌త్య‌లు చోటు చేసుకున్నాయేమో.. కానీ.. కుప్పంలో అలాంటి ఇబ్బందులు రాలేదు. సో.. కుప్పం అభివృద్ధి చేయ‌లేదు.. అన‌డం.. నిజంగానే పొర‌పాటు!

ఇక‌.. సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌పులివెందుల‌ను ప‌ట్టించుకున్న‌వారు ఉన్నారా? ఉంటే.. క‌మీష‌న్ల‌కు కక్కుర్తి ప‌డ‌లేదా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. జ‌గ‌న్ ఇటీవ‌ల అనేక కార్య‌క్ర‌మాల‌కు ఇక్క‌డ శంకుస్థాప‌న‌లు చేశారు.క అంటే.. ఆయా ప‌నులు గ‌తంలో ఇక్క‌డ ప్రాతినిధ్యం వ‌హించిన వైఎస్ కుటుంబం ప‌ట్టించుకోలేద‌నేగా! సో.. దీనిని బ‌ట్టి చంద్ర‌బాబు విజ‌న్ కుప్పంలో ఎంత ఉందో.. క‌నీసం.. అందులో పావ‌లా వంతు కూడా.. పులివెందుల‌లో వైఎస్ కుటుంబం చూపించ‌లేక పోయింద‌ని.. వేరేగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదుగా అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.