Begin typing your search above and press return to search.
లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి పెద్ద యాక్షన్ చేశాడు
By: Tupaki Desk | 1 Dec 2020 2:01 PM GMTఏపీ మంత్రివర్గంలోనే చలాకీగా మాట్లాడుతూ నొప్పి తెలియకుండా పంచులు వేయడంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్టైలే వేరు. ఒక సూది ఇచ్చినట్టు.. సుతారంగా ఆయన వేసే పంచులు ప్రత్యర్థులకు కాస్త గట్టిగానే తగులుతాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో మంత్రి కన్నబాబు టీడీపీపై పంచుల వర్షం కురిపించారు.
నివర్ తుపాను నష్టం- ప్రభుత్వ చర్యలపై చర్చ శాసనమండలిలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి కన్నబాబు... ‘‘లోకేష్ ట్రాక్టర్ తీసుకెళ్లి పెద్ద యాక్షన్ చేశాడు. ఆయనకు కనీసం ట్రాక్టర్ నడపడం కూడా రాదు. నాడు వ్యవసాయం దండగ అన్నారు. 9 నెలలు హైదరాబాద్‌లో దాక్కుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తీరును ప్రస్తావిస్తూ చురకలు అంటించారు.
గత చంద్రబాబు ప్రభుత్వంపై కన్నబాబు విరుచుకుపడ్డారు. సహకార రంగాన్ని నిర్వీర్యం చేసింది చంద్రబాబేనన్నారు. హెరిటేజ్ డెయిరీ ఏ రోజైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి సహకార రంగం కుప్పకూలిందన్నారు.. ‘హెరిటేజ్ డెయిరీ కోసమే చిత్తూరు డెయిరీని చంపేశారు. డెయిరీలను మాక్స్ యాక్ట్ నుంచి కంపెనీ యాక్ట్ ఎందుకు తీసుకువచ్చారనే దానిపై లోకేష్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకు మేలు చేసేందుకు పాడి పరిశ్రమకు సంబంధించి అమూల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్ తో రైతులకు లాభం చేకూరనుంది’ అని కన్నబాబు తెలిపారు.