Begin typing your search above and press return to search.
కన్నబాబు సెటైర్..బ్లాక్ డే కాదు - ఎల్లో డే
By: Tupaki Desk | 23 Jan 2020 12:38 PM GMTనిరసనల్లో ఎవరి స్టైల్ వారిది. ఒకరు కూర్చుని నిరసన తెలిపితే...మరొకరు రోడ్డుకు అడ్డంగా పడుకుని మరీ నిరసన తెలుపుతారు. మరొకరేమో నీళ్లలో తేలియాడుతూ నిరసన తెలుపుతారు. ఈ తరహా నిరసన ఇటీవల ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ సారి దర్శనమిచ్చింది. అయినా నిరసనల్లో ఉన్న ఇలాంటి సరికొత్త విధానాలను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నామంటారా? అయితే అసలు విషయంలోకి వెళ్లిపోదాం పదండి. తమకు గిట్టని నిర్ణయం వెలువడితే... ఆ రోజును మనం బ్లాక్ డే అంటాం కదా. అయితే వైసీపీ కీలక నేత, జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న కురసాల కన్నబాబు... బ్లాక్ డే కాదు... బుధవారం వికేంద్రీకరణ బిల్లు - సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న బుధవారాన్ని ఎల్లో డేగా పరిగణించాలని డిమాండ్ చేశాురు. ఇదేదో కాస్తంత కొత్తగా ఉంది కదూ. అయితే వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పలు సంచలన వ్యాఖ్యలు - సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీకి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ జగన్ సర్కారు ప్రతిపాదించిన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపినా... శాసన మండలి మాత్రం రెడ్ సిగ్నల్ వేసేసింది. విపక్ష టీడీపీకి బలమున్న కౌన్సిల్... అసెంబ్లీ ఆమోందించిన ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ షరీఫ్... మండలి చైర్మన్ హోదాలో ఈ దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. షరీఫ్ తీసుకున్న ఈ నిర్ణయం అధికార వైసీపీకి షాకింగేనని చెప్పక తప్పదు. అయితే నిబంధనలకు విరుద్ధమైనా కూడా తన విచక్షణ మేరకే ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా షరీఫ్ చేసిన ప్రకటనపై వైసీపీ భగ్గుమంటోంది.
షరీఫ్ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు నిన్న మండలిలోనే నిరసన తెలిపారు. తాజాగా షరీఫ్ తీసుకున్న నిర్ణయంపై చర్చించేందుకు మరో రోజు పాటు అసెంబ్లీ సమావేశాలను పొడిగించగా... గురువారం నాటి సమావేశాల్లో షరీఫ్ నిర్ణయంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులను పరోక్షంగా ఎన్నికైన ఎమ్మెల్సీలున్న శాసన మండలి తిరస్కరించడమేమిటని కూడా వైసీపీ ఆరోపించింది. ఈ సందర్భంగా బొత్స, బుగ్గన లాంటి వైసీపీ మంత్రులు షరీఫ్ నిర్ణయం తీసుకున్న రోజును బ్లాక్ డేగా అభివర్ణిస్తే... మాజీ జర్నలిస్ట్ అయిన మంత్రి కన్నబాబు మాత్రం ఆ రోజును బ్లాక్ డే గా కాకుండా ఎల్లో డేగా అభివర్ణించారు. టీడీపీకి చెందిన షరీఫ్ ఆ నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఎల్లో పార్టీ నేత నిర్ణయం తీసుకుంటే... దానిని ఎల్లో డేగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.