Begin typing your search above and press return to search.
ఈసారి కేబినెట్‌లోకి కర్నూలు మైనార్టీ నేత.. ఖాయం!
By: Tupaki Desk | 28 March 2022 3:30 AM GMTత్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఎవరికి పదవులు చిక్కుతాయి.. ఎవరికి అదృష్టం వరిస్తుంది.? అనే చర్చ అధికార పార్టీలో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా గత మంత్రి వర్గ విస్తరణలో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చిన జగన్.. ఇప్పుడు కూడా అదే తరహాలో వ్యవహరించడంతో పాటు.. మహిళలకు.. 50 శాతం పదవులు ఇచ్చేఆలోచన చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు ప్రబుత్వంపై ఉన్న అంతో ఇంతో వ్యతిరేకత.. పోయి.. ఈ విషయంపై పెద్దగా చర్చ సాగు తుందని.. దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని.. జగన్ భావిస్తున్నారట.
సరే! ఈ విషయం అలా ఉంచితే.. ప్రస్తుతం మైనారిటీ వర్గానికి చెందిన అంజాద్ బాషా.. జగన్ కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వచ్చే మంత్రి వర్గ ప్రక్షాళనలో అంజాద్ బాషాను పక్కన పెట్టడం ఖాయం. ఈయన ప్రస్తుతం .. కడప జిల్లా కడప నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. ఈ స్థానాన్ని కొత్తగా ఎవరితో భర్తీ చేస్తారనే విషయంపై చర్చ సాగుతోంది. వైసీపీలో మొత్తం నలుగురు మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కర్నూలు జిల్లా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గం.. ఎమ్మెల్యే ముస్తఫాలు ముందు వరుసలో ఉన్నారు.
అయితే.. ఈ సారి పదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బం టుగా ఉన్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు మంత్రి పదవి దక్కుతుందనే చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధపడినా.. నాడు జగన్ మోహన్ రెడ్డి మాట గౌరవించి ఎస్వీ మోహన్ రెడ్డి గెలుపు కోసం పాటుపడ్డారు. మోహన్ రెడ్డి గెలిచిన అనంతరం వైసీపీని వదిలి పెట్టి.. తెలుగుదేశం పార్టీలో చేరారు.
అయితే.. కర్నూల్ నియోజకవర్గంలో వైసీపీని బలోపేతం చేయడంతోపాటు.. ప్రజల మధ్యలో ఉంటూ 2019 ఎన్నికల్లో బలమైన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్‌పై హఫీజ్ ఖాన్ విజయం సాధించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా మైనారిటీలు అధికంగా ఉన్న కర్నూలు జిల్లా నుంచి హఫీజ్ ఖాన్‌కు మంత్రి పదవిని ఇస్తే.. మైనార్టీలకు పెద్దపీట వేసిందనట్లు అవుతుందని పార్టీ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేసమయంలో ఇప్పటి వరకు కడపకు ప్రాధాన్యం ఇచ్చారు కనుక. ఈ దఫా. కర్నూలుకు ఇస్తే.. బాగుంటుందనే చర్చ కూడా సాగుతుండడం గమనార్హం.