Begin typing your search above and press return to search.
కర్నూలు రోడ్డు మీద పోలీసులు కొట్టుకున్నారు
By: Tupaki Desk | 10 Jun 2017 7:24 PM GMTశాంతిభద్రతల్ని కాపాడుతూ.. క్రమశిక్షణతో.. బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసులు.. బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ఒంటి మీద ఖాకీ ఉందన్న అహంకారంతో కన్ను మిన్ను కానని రీతిలో వ్యవహరించిన వైనం సంచలనంగా మారింది. రూల్స్ ను బ్రేక్ చేసే వారికి చట్టబద్ధంగా శిక్షించాల్సిన అధికారులు.. తామే ఆ ధర్మాన్ని పాటించటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు ఒకరు రూల్స్ ను ఫాలో కావాలని చెప్పిన దానికి.. నడిరోడ్డు మీదన పోలీస్ కానిస్టేబుళ్లు కొట్టేసిన వైనం అవాక్కు అయ్యేలా చేసింది. కర్నూలు నగరానికి నడిబొడ్డు లాంటి రాజ్ విహార్ సర్కిల్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది.
రాజ్ విహార్ సర్కిల్లో హుస్సేన్ అనే హోంగార్డు ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో మనోజ్ కుమార్.. మణికుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ వెళుతున్నా.. కానిస్టేబుళ్ల వాహనాలు మాత్రం ముందుకు కదల్లేదు. దీంతో.. రద్దీగా ఉన్న రోడ్డు మీద బైక్‌ను ఎందుకు ఆపారంటూ హోంగార్డ్ ప్రశ్నించారు. తమనే ప్రశ్నిస్తావా? అంటూ రెచ్చిపోయిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. హోంగార్డును నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా చితక్కొట్టేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన కానిస్టేబుళ్లు అంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించటం ఏమిటన్న మాట అక్కడి వారి నోటి నుంచి వినిపించింది.
ఈ ఉదంతం గురించి మొత్తం సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ.. జరిగిన దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో గొడవపడి.. భౌతికదాడికి దిగిన కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/