Begin typing your search above and press return to search.
కుష్భూ పేరు ఎందుకు మార్చుకున్నారంటే
By: Tupaki Desk | 21 April 2018 2:51 PM GMTతమిళ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఒకదాని వెంట మరొకటి అన్నట్లుగా ఆ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కుష్బూ పేరు మార్పుతో తమిళ పాలిటిక్స్ మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే కుష్బూ తన పేరు మార్చుకున్నారు. రికార్డుల్లో కాదు ట్విట్టర్ అకౌంట్. ఎందుకంటే....రికార్డుల్లో ఎలాగూ ఆమె పేరు వేరే కాబట్టి.
ఇంతకీ విషయం ఏంటంటే...కుష్బూ అసలు పేరు నఖట్ ఖాన్. సినీ రంగంలోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే ఆమె తన పేరును మార్చుకుని కుష్భుగా సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే ఈ విషయం తెలిసింది కొందరికే. ఈ నేపథ్యంలో కుష్బూ అసలు పేరు అది కాదనే విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ రాజకీయం చేయటం ప్రారంభించింది. సోషల్ మీడియా వేదికగా కుష్బూ అసలు పేరు దాస్తున్నారంటూ భారీ ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కుష్బూ తన ట్విట్టర్ అకౌంట్‌లో పేరు మార్చారు. `కుకష్బూసుందర్... బీజేపీ కోసం నఖట్‌ఖాన్’ అంటూ కొత్త పేరుతో తన అకౌంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. తానెందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కుష్బూ వివరిస్తూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ తన తల్లిదండ్రుల పెట్టిన పేరుపై రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన నేతలు ఇలా చేయడం గురించి ఇలా చేయడం గురించి వారే ఆలోచించుకోవాలి. మత రాజకీయాలు చేసే బీజేపీకి బుద్ధి చెప్పేందుకే ఇలా పేరు మార్చుకున్నాను అంటూ వివరించారు.