Begin typing your search above and press return to search.
పవన్ పై విమర్శలకు ఖుష్బూ క్లారిటీ
By: Tupaki Desk | 10 Dec 2018 12:40 PM GMTహీరోయిన్ గా తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకున్న నటి ఖుష్బు. ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కొనసాగుతున్నారు. అదే సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. తాజాగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఖుష్బూ స్టార్ కాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలోనే పవన్ పై ఆమె విమర్శలు చేశారంటూ వార్తలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదు అంటూ ఖుష్బు అన్నారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. జనసేన పై తాను విమర్శలు చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖుష్బు కొట్టిపారేశారు. తాను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను, కాని నాకు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి పెద్దగా అవగాహణ లేదని పేర్కొంది. జనసేన పార్టీ గురించి తనకు ఏమీ తెలియనప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడుతాను అంటూ ఖుష్బు ఎదురు ప్రశ్నించింది.
భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసే ఆలోచన ఉందా అంటే రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే తప్పకుండా పోటీ చేస్తానని, ఎక్కడ నుండి, ఎలా అనేది మాత్రం పార్టీ అధినాయకత్వం మాత్రమే నిర్ణయిస్తుందని పేర్కొంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆమె తెలుగు రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.