Begin typing your search above and press return to search.
మాజీ హీరోయిన్ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్?
By: Tupaki Desk | 13 July 2016 7:01 AM GMTపొలిటికల్ గ్రామర్ కంటే కూడా సినీ గ్లామర్ పార్టీకి కొత్త కళ తీసుకొస్తుందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తుందా? అంటే అవునన్నట్లుగానే తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా అలనాటి బాలీవుడ్ హీరో రాజ్ బబ్బర్ ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మరికొద్ది నెలల్లో యూపీ స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ.. రాజ్ బబ్బర్ ను యూపీ పార్టీ చీఫ్ గా ఎంపిక చేయటం కాస్తంత ఆస్తకికరంగా మారింది.
మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ ను మార్చాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఆ అవకాశం నాటి హీరోయిన్ కుష్భూ చేతికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. రికార్డు స్థాయిలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఒక మహిళను పార్టీ అధ్యక్షురాలిగా నియమిస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో పాటు.. కుష్బూ పట్టుదల మీద నమ్మకంతో ఆమెకు అవకాశం ఇచ్చే దిశగా పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల ఆమెతో పార్టీ చీఫ్ సోనియాగాంధీ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ భేటీ అయిన నేపథ్యంలో కుష్భూకు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.