Begin typing your search above and press return to search.
గనిలో కూలీకి 50లక్షల వజ్రం..దరిద్రం ఖతం
By: Tupaki Desk | 22 July 2020 4:30 PM GMTరోజంతా కష్టపడితే ఒక్క పూట భోజనానికి కూడా కష్టమయ్యే కూలీకి లక్ష్మీదేవి కటాక్షించింది. ఏకంగా రూ.50లక్షల వజ్రం దొరికేలా చేసింది. అతడి దరిద్రాన్ని ప్రారదోలింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా రాణిపుర గని తవ్వకాల్లో ఓ నిరుపేద కూలీకి వజ్రం దొరికింది. మిలమిల మెరిసిపోయే ఈ వజ్రం దొరకడంతో ఇక తన కష్టాలు తీరుతాయని ఆ కూలీ ఆనందపడిపోయాడు. ఆ వజ్రం విలువ రూ.50లక్షలు అని తెలిసి ఆశ్చర్యపోయాడు.
మధ్యప్రదేశ్ రాణిపురాలోని ఓ భూమిలో తవ్వకాలు జరుపుకునేందుకు అధికారులు ఆనందిలాల్ వ్యక్తికి పట్టా ఇచ్చారు. కూలీలతో కలిసి ఆనంద్ లాల్ కొద్ది నెలలుగా తవ్వకాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కూలీ కుష్వాహకు 10.69 క్యారెట్ల వజ్రం కనిపించింది. దాన్ని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండేకు చూపించగా రూ.50లక్షల విలువగల వజ్రం అని తెలిపాడు.దీంతో సదురు కూలీకి, ఓనర్ కు పట్టపగ్గాలు లేకుండా పోయింది.
ఇంతకు ముందు కూడా ఇదే కుష్వాహకు చిన్న వజ్రపు ముక్క దొరకడం విశేషం.దీంతో మరింత ఉత్సాహంగా తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తగ్గించిన తర్వాత ఆదాయాన్ని డిపాజిటర్ కు ఇస్తామని అధికారులు తెలిపారు. దీంతో కూలీ, యజమాని లక్షాధికారి అయినట్టే కనిపిస్తోంది.