Begin typing your search above and press return to search.

కుటుంబ రావుకు కోపం వచ్చింది

By:  Tupaki Desk   |   5 Sep 2018 1:30 AM GMT
కుటుంబ రావుకు కోపం వచ్చింది
X
ఆర్దికవేత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్దిక సలహాదారుడు కుటుంబ రావుకు కోపం వచ్చింది. ఎప్పుడూ సౌమ్యంగా నవ్వుతూ ఉండే కుటుంబ రావుకు కోపం తీసుకు వచ్చిన అంశం అమరావతి బాండ్లు. రాజధానికి సంబంధించి బాండ్లు విడుదల చేయాలని నిర్ణయించడం, ఆ మేరాకు ముంబాయ్‌ లో ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యంత్రి నారా చంద్రబాబు నాయుడు షేర్‌ మార్కెట్‌లో గంట కొట్టడం కూడా జరిగిపోయాయి. ఇంతవరకూ బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విలువ పెరిగిపోతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీరాలు పోయింది. ఇదంతా చదివిన, విన్నా టివీలలో చూసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఇక్కడి వరకూ కధ సజావుగానే సాగింది. లోక్‌ సభ మాజీ సభ్యడు, మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్ అమరావతి బాండ్లపై పెదవి విప్పగానే గందరగోళం ప్రారంభమయింది. ఉండవల్లి చేసిన ఆరోపణలతో ఆర్దిక సలహాదారుడు కుటుంబ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి బాండ్లపై - రాజా ఆఫ్ కరప్షన్ పై చర్చించేందుకు ఉండవల్లి సిద్దమా అంటూ సవాల్ విసురుతున్నారు. అమరావతి బాండ్లను సేబీ గుర్తింపు పొందిన వారికే ఇచ్చామని చెబుతున్నారు. ఇంతకంటే తక్కువకు ఎవరైన బాండ్లు కొనుగోలు చేస్తే వారికి ఆరెంజ్డ్ ఫీజ్‌ లేకుండా బాండ్లను ఇస్తామంటూ చెబుతున్నారు.

ఇదిలా ఉండగా అమరావతి బాండ్లపై లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ‌్ కుమార్ చేసిన ఆరోపణలకు మద్దతు లభిస్తుందని రాజకీయ, ఆర్దిక వ్యవహారాలు నిపుణులు అంటున్నారు. దీనికి గతంలో మార్గదర్శి సంస్థపై ఉండవల్లి చేసిన పోరాటమే తార్కణమని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్దిక సలహాదారుడు కుటుంబ రావు చెబుతున్న అంశాల వెనుక రాజకీయ కోణం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపణలపై, విమర్శలపై స్పష్టత ఉంటుందని వారి అభిప్రాయంగా చెబుతున్నారు. మరో వైపు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కూడా అమరావతి బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అవినీతి డబ్బుతో ఈ బాండ్లను కొనుగోలు చేసారని, వీటిని కొనుగోలు చేసిన వారెవరో వారి వివరాలు వెల్లడించాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అమరావతి బాండ్లు తెలుగుదేశం ప్రభుత్వానికి బ్యాండ్‌ బాజాగా మారుతున్నట్లు తెలుస్తోంది.