Begin typing your search above and press return to search.
మహిళల విషయంలో కువైట్ మరో సంచలన నిర్ణయం .. ఏంటంటే
By: Tupaki Desk | 13 Oct 2021 10:36 AM GMTగల్ఫ్ దేశం కువైత్ మహిళల విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వారి కూడా ఆర్మీలో పనిచేసేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు మంగళవారం కీలక ప్రకటన చేసింది. కువైత్ నేషనల్ మిలిటరీ సర్వీస్‌లో మహిళల కోసం కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆర్మీ అధికారులకు ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబెర్ అల్ అలీ అల్ సబా ఆదేశించారు. కువైత్ మహిళలు జాతీయ సైనిక సేవలో చేరడానికి రిజిస్ట్రేషన్ తెరిచేందుకు మంగళవారం ఆయన మంత్రివర్గ నిర్ణయాన్ని జారీ చేశారు. కాగా, దరఖాస్తుదారులకు ప్రాథమిక దశలో వైద్య, సైనిక మద్దతు విభాగంలో సేవ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండడంతో అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమలోనే కువైట్ దేశం కూడా విదేశీయుల రాకపోకలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వలసదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న కువైట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ వేలాది మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రొఫెషన్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన సుమారు 40వేల మంది వలసదారులు ప్రొఫెషన్ మారిన తర్వాత తిరిగి వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇలా ప్రొఫెషన్ మారిన తర్వాత కూడా డ్రైవింగ్ లైసెన్సులను ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో వారు ఆటోమెటిక్ ఆ లైసెన్స్‌లను కోల్పోయినట్లేనని అధికారులు పేర్కొన్నారు. కొత్త ప్రొఫెషన్ ఆధారంగా పాత లైసెన్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ, చాలామంది అలా చేయలేదు. అంతేగాక వీటిలో చాలా మంది లైసెన్సులకు గడువు ముగిసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా గడువు ముగిసిన వాటితో పాటు ప్రొఫెషన్ మారిన వారి లైసెన్సులను రద్దు చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.