Begin typing your search above and press return to search.
వలసదారులకు కువైట్ షాక్..
By: Tupaki Desk | 1 Feb 2019 11:19 AM GMTగల్ఫ్ దేశం కువైట్.. వలసవాదులకు షాకిచ్చింది. కువైట్ లో తమతోపాటు కుటుంబ సభ్యులు కూడా ఉండాలంటే 992 డాలర్లు(70వేల రూపాయలకు పైగా) ఇక నుంచి చెల్లించాలంటూ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీనిపై గల్ఫ్ వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటి వరకూ కువైట్ లో విజిట్ వీసా కింద ఉండాలంటే 30 కువైట్ దీనార్లు (7వేలు), తాత్కాలిక రెసిడెన్సీ ఫీజు కింద ఉండాలంటే 20 కువైట్ దీనార్లు (4600 రూపాయలు) చెల్లించాలి. ఇప్పుడు కుటుంబంతో కలిసి ఉంటే 70వేల రూపాయలు చెల్లించాలని కువైట్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంటే మొత్తం 81600 రూపాయలను వలసదారుడు ఈ ఫీజుల కింద కట్టాల్సి వస్తోంది.
2019 జూన్ నెల నుంచి ఈ మొత్తం ఫీజుల అమలును ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విదేశీయులను తగ్గించడం.. కువైట్ పౌరుల సంఖ్యను పెంచేందుకు కువైట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కువైట్ లో నిరుద్యోగుల శాతాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.