Begin typing your search above and press return to search.
ఈ శుక్రవారం ఏపీకి ఫ్రెండ్స్ ఎవరో తేలిపోనుంది
By: Tupaki Desk | 19 July 2016 7:31 AM GMTమరో మూడు రోజుల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి జరిగిన నష్టానికి పరిహారంగా ఆ రాష్టానికి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన వేళ.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా ప్రకటించటం మర్చిపోకూడదు. భారతదేశ ప్రధానిగా ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు. దీనికి ప్రతిగా నాటి విపక్షంలో ఉన్న వెంకయ్యనాయుడు అయితే.. తాము అధికారంలోకి వస్తామని.. వచ్చాక ఐదేళ్లు కాదు పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పటం మర్చిపోలేం.
ఇదిలా ఉండగా.. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత.. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదాపై తూచ్ అనేయటం.. గడిచిన పాతికనెలల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నీళ్లకు వదిలేయటం చూస్తున్నదే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. ఈ బిల్లుపై ఓటింగ్ ఈ శుక్రవారం వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అనుకూలంగా ఎంతమంది ఉండనున్నారు? ఎంతమంది వ్యతిరేంచనున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ బిల్లు విషయంలో మద్ధుతు ఇవ్వాలని టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎంపీలకు స్పష్టంగా చెప్పేశారు. మొత్తం 245 మంది ఎంపీలున్న రాజ్యసభలో ఎన్డీయేకు 72 మంది ఎంపీలు ఉండగా.. యూపీఏ తరఫున 66 మంది సభ్యులు ఉన్నారు. ఇక జనతా పరివార్ పార్టీ తరఫున 15 మంది.. జనతాదళ్ తరఫున 10 మంది.. రాష్ట్రీయ జనతాదళ్ తరఫున ముగ్గురు.. ఇండియన్ నేషనల్ లోక్ దళ్.. జనాతాదళ్ సెక్యులర్ పార్టీలకు ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. వీరే కాక.. సమాజ్ వాదీకి 19.. అన్నాడీఎంకేకు 13.. తృణమూల్ కాంగ్రెస్ కు 12.. బిజూ జనతాదళ్ కు 8.. సీపీఎంకు 8.. బీఎస్సీకి 6.. నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు.. టీఆర్ ఎస్ కు ముగ్గురు.. సీపీఐ.. జార్ఖండ్ ముక్తి మోర్చా.. వైఎస్సార్ కాంగ్రెస్ లకు ఒక్కొక్కరు చొప్పున బలం ఉంది. వీరు కాక.. 10 మంది నామినేటెడ్ సభ్యులు.. నలుగురు ఇండిపెండెంట్లు ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది.
తాజా పరిస్థితుల్లో బిల్లు పెట్టిన కాంగ్రెస్.. ఏపీ అధికార.. ప్రతిపక్షం తప్పనిసరిగా బిల్లుకు అనుకూలంగా ఓటు వేయటం ఖాయం. మరి.. బీజేపీతో పాటు మిగిలిన పక్షాల ఎలా ఓటు వేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే ఈ శుక్రవారం ఓటింగ్ జరిగిన పక్షంలో.. ఏపీకి అనుకూలంగా ఉండే పార్టీలు ఏమిటన్నవి ఇట్టే తెలుస్తుందని చెప్పొచ్చు.