Begin typing your search above and press return to search.
జైట్లీ ఓడారు..కేవీపీ గెలిచారు
By: Tupaki Desk | 19 Nov 2016 6:05 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు - రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్రవ్య బిల్లేనని రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ రూలింగ్ ఇచ్చారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పీసీ కురియన్ చైర్మన్ అన్సారీ రూలింగ్ ను చదివి వినిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు పునర్విభజన చట్టాన్ని సవరించాలని కోరుతూ కేవీపీ ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు పరిధిలోకి వస్తుంది కాబట్టి దీనిపై రాజ్యసభలో చర్చ జరిపేందుకు వీలు లేదని ఆర్థిక శాఖ మంత్రి - రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ వాదించారు. ద్రవ్య బిల్లును కేవలం లోక్ సభలోనే ప్రతిపాదించాలని ఆయన సూచించారు. దీంతో కేవీపీ ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? లేదా? అనేది నిర్థారించాలంటూ చైర్మన్ హమీద్ అన్సారీ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపించారు. సుమిత్రా మహాజన్ వ్యక్తం చేసిన నిర్ణయం మేరకు హమీద్ అన్సారీ రూలింగ్ ఇచ్చారు.
రాజ్యాంగంలోని 110 ఆర్టికల్ ప్రకారం కేవీపీ ప్రతిపాదించిన బిల్లు ద్రవ్య బిల్లు కాదని సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. అయితే లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్పీకర్ నిర్ణయాన్ని రాజ్యసభకు తెలియజేస్తూ రెండు రాష్ట్రాల్లో ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయవలసి ఉన్నందున రాజ్యాంగంలోని 110 ఆర్టికల్ క్లాజ్ 1లోని సబ్ క్లాజ్ ‘ఇ’ ప్రకారం ఇది ఏ క్యాటగిరీ ఆర్థిక బిల్లు అవుతుందని అభిప్రాయపడినట్లు హమీద్ అన్సారీ తమ రూలింగ్ లో తెలిపారు. ఆర్థిక బిల్లు పరిధిలోకి వస్తున్నందున దీనిని లోక్ సభలో మాత్రమే ప్రతిపాదించాలని లోక్ సభ సెక్రటరీ జనరల్ స్పష్టం చేశారని ఆయన తెలిపారు. ఈ అభిప్రాయంతో కేంద్ర న్యాయ శాఖ కూడా ఏకీభవించిందని అన్సారీ తెలిపారు. రాజ్యసభ నియమ నిబంధనల్లోని 185 రూల్ లోని సబ్ రూల్ 3 ప్రకారం కెవిపి బిల్లుపై తదుపరి చర్చను రద్దు చేయటంతోపాటు పెండింగ్ బిల్లుల రిజిష్టరు నుండి దీనిని తొలగించాలని ఆదేశిస్తున్నట్లు అన్సారీ ప్రకటించారు.
కేవీపీ సవరణ బిల్లు ద్రవ్య బిల్లు పరిధిలోకి రాదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన వివరణతో మంత్రి అరుణ్ జైట్లీ ఓడిపోగా కేవీపీ గెలిచారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి - రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ - సీనియర్ నాయకుడు జయరాం రమేష్ అభివర్ణించారు. వారు కేవీపీతో కలసి విలేఖరులతో మాట్లాడారు. రాజ్యసభ చైర్మన్ ఇచ్చిన రూలింగ్ ఆధారంగా తాను జైట్లీపై సుప్రీంకోర్టులో కేసు వేయనున్నట్లు కేవీపీ ప్రకటించారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్రవ్య బిల్లు పరిధిలోకి వస్తుందని చెప్పటం ద్వారా జైట్లీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారని వారు ఆరోపించారు. తనది ద్రవ్య బిల్లు కాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టంగా తీర్పు చెప్పినా రాజ్యసభ చైర్మన్ మాత్రం దీనిని ద్రవ్య బిల్లుగా చిత్రీకరించటం అన్యాయమని కేవీపీ విమర్శించారు. జైట్లీతోపాటు హమీద్ అన్సారీ రూలింగ్ పై కోర్టుకు వెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నిర్ణయం అందరికీ శిరోధార్యం అంటూ స్పీకర్ నిర్ణయానికి విరుద్ధంగా రాజ్యసభ నిర్ణయం తీసుకోవటం ఏమిటని కేవీపీ ప్రశ్నించారు. కురియన్ చదివిన రూలింగ్ తమను షాక్‌కు గురి చేసిందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాజ్యసభ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. స్పీకర్ నిర్ణయాన్ని కాదనే హక్కు రాజ్యసభకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/