Begin typing your search above and press return to search.
పోలవరం యాత్ర ముగిసింది..కేవీపీ సవాల్
By: Tupaki Desk | 11 Jan 2018 4:23 AM GMTఏపీకి వరప్రదాయిని అయిన ప్రాజెక్టుకు జీవం పోయడం అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడం లక్ష్యంగా ఏపీలో ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. పట్టిసీమ నుంచి పాదయాత్రగా పోలవరం చేరుకున్న కాంగ్రెస్ నాయకులు పోలవరం గ్రామంలోని భాను ధియేటర్ వద్ద సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి స్పిల్ వే నిర్మాణ ప్రాంతంతోపాటు డయాఫ్రం వాల్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఈ ముగింపు సందర్భంగా ఎంపీ కేవీపీ రామచంద్రరావు చేసిన సవాల్ అదిరిందని...టీడీపీ నేతల నోరు మూతపడేలా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈ నెల 7వ తేదీ చేపట్టిన మహా పాదయాత్ర బుధవారం పోలవరం చేరుకోవడంతో ముగిసింది. ఈసందర్భంగా పోలవరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేపట్టిన సామూహిక సత్యాగ్రహంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దేవాలయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే పూర్తికావాలని మంచి మనస్సుతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్ర ‘ప్రజా పాదయాత్ర’గా ముగిసిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తికావాలని కోరుకుంటున్నారని పాదయాత్రలో వెల్లడయ్యిందన్నారు.
ప్రాజెక్టు నిర్మించకుండా కాలువలు తవ్వేశారని గతంలో తెలుగుదేశం పార్టీ వారే విమర్శించేవారని - కాలువలు తవ్వివుండకపోతే పట్టిసీమ ద్వారా గోదావరి నీరు కృష్ణా డెల్టాకు తరలించగలిగేవారా అని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. సోమవారాన్ని పోలవారంగా ప్రకటించుకుని ఇక్కడకు వచ్చి భూమిపూజలు చేయడం - మిషన్లు ప్రారంభించడం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకనైనా ఇటువంటి పనికి మాలిన పనులు ఆపి నిర్మాణంపై శ్రద్ధ చూపాలని హితవుపలికారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడతామన్నారు. 2018 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వడానికి ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో పూర్తినిధులు కేటాయించాలని రఘువీరా డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధనకు లోక్ సభలో సోనియాగాంధీ - రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని - అలాగే రాజ్యసభలో కేవీపీ రామచంద్రరావు ఆంధ్రుల వాణి వినిపిస్తారన్నారు. రాజకీయ ఆలోచనతో తాము పాదయాత్ర చేయలేదని- ప్రాజెక్టు నిర్మాణం పూర్తవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
రాజ్యసభ్య సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రలో నీటి విలువ తెలుసుకుని - పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాను అడ్డుకుంటున్నానని తెలుగుదేశం వారు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. చట్టప్రకారం నిర్మాణానికి పూర్తినిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మాత్రమే కోర్టులో కేసు వేసినట్టు ఆయన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు వారు చేసిన ఆరోపణ నిరూపిస్తే రెండున్నరేళ్లు ఉన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనని కేవీపీ సంచలన సవాల్ చేశారు.
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం గోదావరి డెల్టాలో రైతులు నీటికోసం ఇబ్బంది పడుతున్నారని, పట్టిసీమ ఎత్తిపోతల నిర్మిస్తే ఇష్టమొచ్చినట్టు గోదావరి నీరు తోడేస్తారని ఆందోళన చెందామని - అది ఇప్పుడు నిజమైందన్నారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా గత తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడూ పోలవరం ప్రాజెక్టును తలవని చంద్రబాబు ప్రస్తుతం పోలవరం నా కల అని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక అని, దానిపై పేటెంట్ హక్కు తమకే ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటివరకు ఏడువేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చుచేశాయని, కేంద్ర ప్రభుత్వం ఈతరహాలో నిధులు కేటాయిస్తే నిర్మాణం పూర్తవ్వడానికి మరో 20 ఏళ్ల సమయం పడుతుందన్నారు. మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, ప్రజలంటే వారికి గౌరవం లేదన్నారు. ఎన్నికల్లో డబ్బు ఇచ్చి గెలవవచ్చనే ఆలోచనలో ఉందని ఆరోపించారు.