Begin typing your search above and press return to search.

పోలవరం రచ్చ.. బాబును వదలని కేవీపీ

By:  Tupaki Desk   |   7 May 2019 6:35 AM GMT
పోలవరం రచ్చ.. బాబును వదలని కేవీపీ
X
ఏపీ సీఎం చంద్రబాబు బలాన్ని బలహీనతగా చూపించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అయిన కాంగ్రెస్ నేత కేవీపీ రాంచంద్రరావు నడుం బిగించారు. వరుస లేఖాస్త్రాలతో బాబును ఇరుకునపెడుతున్నారు. ఇప్పటికే పోలవరంపై బహిరంగ లేఖ రాసి నిప్పు రాజేసిన కేవీపీ తాజాగా మరో బహిరంగ లేఖ రాసి సంచలనం రేపారు.

తాజా లేఖలో కేవీపీ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం కావాలనే పెంచిందని..ఈ విషయాన్ని దాచిపెట్టిందని కేవీపీ లేఖలో ప్రశ్నించారు. రూ.28467 కోట్లను పెంచారని.. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం స్పష్టం చేసిందని.. ఈ విషయం బాబుకు తెలిసినా ప్రజలకు చెప్పడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా పోలవరం ఖర్చును కేంద్రమే భరించాలని.. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని చంద్రబాబు కు సూచించారు. .18 నెలలుగా పోలవరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు హైకోర్టులో కౌంటర్ వేయలేదని ప్రశ్నించారు.

అంతేకాదు కేవీపీ పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని.. మరోసారి రాసిన బహిరంగ లేఖలో బాబును కోరారు. పోలవరం పై మంత్రి దేవినేని ఉమకు ఏమాత్రం అవగాహన లేదని స్పష్టం చేశారు.

ఇక కేవీపీ లేఖపై మంత్రి దేవినేని సైతం కౌంటర్ ఇచ్చారు. కేవీపీ పోలవరం ప్రాజెక్ట్ పై ఓనమాలు కూడా తెలియని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మహోన్నత పోలవరం ప్రాజెక్ట్ పై వైఎస్ ఆత్మ కేవీపీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. కేంద్రం పోలవారానికి నిధులు ఇవ్వకున్నా కేవీపీ ఎందుకు ప్రశ్నించరని మంత్రి దేవినేని కౌంటర్ ఇచ్చారు.