Begin typing your search above and press return to search.

కురియ‌న్ జీ... కేవీపీ ఆవేద‌న విన్నారా?

By:  Tupaki Desk   |   4 Feb 2018 8:19 AM GMT
కురియ‌న్ జీ... కేవీపీ ఆవేద‌న విన్నారా?
X
కేవీపీ రామ‌చంద్ర‌రారావు.. ఏపీ ప‌క్షాన రాజ్య‌స‌భ‌లో ఒంట‌రి పోరు సాగిస్తున్న నేత‌గానే చెప్పుకోవాలి. స‌భ‌లో టీడీపీ ఎంపీలున్నా... ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై అస‌లు మాట్లాడ‌మే లేదన్న వాద‌న లేకపోలేదు. ఈ క్ర‌మంలో ఏ ఒక్క‌రు కూడా త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డ‌కున్నా... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేవీపీ మాత్రం ఒంట‌రి పోరుకే సిద్ధ‌ప‌డ్డారు. ఈ దిశ‌గా త‌న‌కు ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా కూడా ఆయ‌న లెక్క చేయ‌డం లేదు. ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం స‌భ‌లో ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లు పెట్టిన కేవీపీ.. ఆ బిల్లుపై చ‌ర్చ వ‌చ్చేదాకా ప‌ట్టుబ‌ట్టారు. చ‌ర్చ సంద‌ర్భంగా త‌న‌దైన వాణిని వినిపించిన కేవీపీ.. ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఎంపీల‌కు గ‌ట్టి దెబ్బే కొట్టారు. ఆ బిల్లు అయితే వీగిపోయింది గానీ... కేవీపీ చేసిన అంటెప్ట్ మాత్రం ఏపీ ప్ర‌జ‌ల మ‌దిలో చిర స్థానాన్ని సంపాదించుకుంద‌నే చెప్పాలి. తాజాగా పార్ల‌మెంటు బడ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి క‌దా. ఈ స‌మావేశాల్లోనూ కేవీపీ త‌న వాణిని వినిపించేందుకే నిర్ణ‌యించుకున్నారు.

ఏపీకి న్యాయ‌బ‌ద్ధంగా ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదాను ప్ర‌క‌టించేదాకా త‌న పోరాటం ఆగ‌ద‌ని ప్ర‌క‌టించిన కేవీపీ... మొన్న ఏకంగా రాజ్య‌స‌భ వెల్‌లోకి దూసుకెళ్లారు. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో పెద్ద‌ల స‌భ‌గా పేరున్న రాజ్య‌స‌భ‌లో... లోక్ స‌భ‌లో మాదిరిగా స‌భ్యులు వెల్ లోకి దూసుకురావ‌డ‌మ‌న్న విష‌యం పెద్ద‌గా క‌నిపించ‌దు. అయితే ఇప్ప‌టికే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంపై బీజేపీ ప్లేటు ఫిరాయించ‌డం, తాజా బ‌డ్జెట్ లో అర‌కొర కేటాయింపుల‌తో స‌రిపెట్టేయ‌డం ప్ర‌తి ఏపీ వాసినీ తీవ్రంగా క‌లచివేసింద‌నే చెప్పాలి. బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న టీడీపీ కూడా ఈ వ్య‌వ‌హారంపై నోరు విప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో మొన్న‌టి స‌భ‌లో ఏపీకి న్యాయం చేయాల‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ప్లకార్డు ప‌ట్టిన కేవీపీ రాజ్య‌స‌భ‌లో నిర‌స‌న‌కు దిగారు. ఒకానొక సంద‌ర్భంలో ఆయ‌న వెల్ లోకి దూసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా కేవీపీని నియంత్రించే క్ర‌మంలో స‌భాధ్య‌క్షుడి స్ధానంలో ఉన్న రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ కురియ‌న్‌... కేవీపీని పిచ్చోడిగా అభివ‌ర్ణించారు. సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌గా ఉండి వెల్ లోకి దూసుకురావ‌డం మీకు స‌బ‌బేనా? అన్న కోణంలో వ్యాఖ్య‌లు చేసిన క‌రియ‌న్‌... మీరు పిచ్చోడిలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ క‌సురుకున్నారు.

అయినా వెనక్కు త‌గ్గ‌ని కేవీపీ త‌న ఆందోళ‌న‌ను విర‌మించ‌కుండా ప్ల‌కార్డుతోనే స‌భ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అయితే కురియ‌న్ త‌న‌ను పిచ్చోడిగా అభివ‌ర్ణించిన తీరు కేవీపీని బాగానే క‌ల‌చివేసిన‌ట్లుంది. త‌న‌పై కురియ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రోమారు గుర్తు చేసుకున్న కేవీపీ.. స‌భాధ్య‌క్ష స్థానంలో ఉండి ఇష్టారాజ్యంగా మాట్లాడే వారికి త‌గిన బుద్ధి చెప్పాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్లున్నారు. వెంట‌నే పెన్నూ - పేప‌ర్ తీసుకున్న కేవీపీ... కురియ‌న్‌కు లేఖ రాసేశారు. *మీరు న‌న్ను పిచ్చోడని అన్నందుకు నాకేమీ బాధ లేదు. కేంద్ర బ‌డ్జెట్లో ఏపీకి జ‌రిగిన అన్యాయం చూసి నేను నిజంగానే పిచ్చోడిని అయ్యాను. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే నేను వెల్‌లోకి రావాల్సి వ‌చ్చింది. కేంద్ర ప్ర‌భుత్వానికి క‌నువిప్పు క‌లిగే దాకా రాజ్య‌స‌భ‌లో నేను ఈ త‌ర‌హా పోరాటాన్నే కొన‌సాగిస్తాను. ముందుగా మీరు రాజ్య‌స‌భ సంప్ర‌దాయాల‌ను గౌర‌వించండి* అంటూ కురియ‌న్‌కు కేవీపీ ఘాటు లేఖే రాశారు.