Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతికి కేవీపీ లేఖ

By:  Tupaki Desk   |   27 Jan 2017 10:41 AM GMT
ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతికి కేవీపీ లేఖ
X
ఏపీ ప్రత్యేక హోదా డిమాండు బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా అణచివేయాలని చూస్తన్నా అది పూర్తిగా కనుమరుగు కావడం లేదు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఏకంగా రాష్ర్టపతికి దీనిపై లేఖ రాశారు. ఇప్పటికే కేంద్రానికి, చంద్రబాబుకు లేఖలు రాసిన ఆయన తాజాగా రాష్ర్టపతికి అన్ని విషయాలూ వివరిస్తూ లేఖ రాశారు.

పార్లమెంటు సాక్షిగా ఆ నాడు మ‌న్మోహ‌న్‌సింగ్‌ ఇచ్చిన హామీని కేంద్ర ప్ర‌భుత్వం నెర‌వేర్చాలని ఎంపీ కేవీపీ డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్ర‌త్యేక హోదా అంశంపై రాష్ట్ర‌ప‌తికి లేఖ రాసిన‌ట్లు తెలిపారు. జ‌ల్లికట్టు పోరాటం నుంచి స్ఫూర్తిని తీసుకోవాల‌ని తాను రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశాన‌ని దాన్ని ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జాభిప్రాయం ముందు ఎవ‌ర‌యినా త‌ల‌వంచ‌వ‌ల‌సిందేన‌ని, జ‌ల్లిక‌ట్టు కోసం త‌మిళులు అద్భుతంగా పోరాడార‌ని ఆ విధానాన్ని ప‌రిశీలించాల‌ని తాను మ‌న‌వి చేశాన‌ని అన్నారు. దాన్ని కూడా ప‌ట్టించుకోలేదని అన్నారు. తాను ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో పెట్టిన ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లును రాకుండా బీజేపీ నేతలు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

తాను రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలను కేవీపీ వివరించారు. కేంద్ర ప్రభుత్వ నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని తాను రాష్ట్రపతికి లేఖ పంపుతున్నానని, ప్ర‌త్యేక హోదా - 2018లోపు పోల‌వ‌రం ప్రాజెక్టుని కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి చేయ‌డం - ఆర్థిక లోటు భ‌ర్తీ - విశాఖ‌కు ప్ర‌త్యేక రైల్వే జోన్ అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/