Begin typing your search above and press return to search.
టైం..ప్లేస్ బాబు చెప్పాలి - కేవీపీ ఛాలెంజ్
By: Tupaki Desk | 8 Jan 2017 12:41 PM GMTప్లేస్ నన్ను చెప్పమంటారా? మీరు చెబుతారా? టైం మీరు చెబుతారా? నన్ను చెప్పమంటారా? ఎనీ టైం అన్న తరహాలో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు చెలరేగిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయన.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. టైంను.. ప్లేస్ ను చంద్రబాబు నిర్ణయించాలని.. తాను చర్చకు సిద్ధమని కేవీపీ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. పోలవరం మీద తాను కుట్రలు చేస్తున్నట్లుగా ఆరోపించటం ఏ మాత్రం సరికాదన్న ఆయన.. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ వేసి.. తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని సవాలు విసిరారు.
ఒకవేళ రుజువు చేయలేకపోతే.. తాను లేఖలోప్రస్తావించిన విషయాలన్నీ వాస్తవాలేనని.. చంద్రబాబు అనుచరులు చేస్తున్నవి అబద్ధాలుగా ప్రజలు అర్థం చేసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం మీద కేవీపీ చేసిన ఓపెన్ ఛాలెంజ్ కు చంద్రబాబు ఏ మేరకు రియాక్ట్ అవుతారో చూడాలి. గడిచిన కొద్దికాలంగా పోలవరంమీద తరచూ మాట్లాడుతున్న కేవీపీ.. తాజాగా తన టోన్ ను మరింత పెంచటం గమనార్హం.