Begin typing your search above and press return to search.
అందమైన అబద్ధాలు చెప్పేది ఆయనేనట!
By: Tupaki Desk | 13 Aug 2017 10:28 AM GMTరాష్ట్రంలో అందమైన అబద్ధాలు ఎవరు చెబుతున్నారో తెలిసిపోయిందట! నిజానికి అబద్ధానికీ తేడా లేకుండా కూడా ఆయన అబద్ధాలను వల్లె వేసేస్తారట. ఆయన నోటి వెంట వచ్చే అబద్ధాలు అరె నిజంగానే ఉన్నాయే అని అనిపించేలా ఆయన నమ్మించడం ఆయన కు మాత్రమే తెలిసిన విద్యట! అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం వరకు ఇటు జిల్లా నుంచి అటు గల్లీ వరకు అమాయకుల నుంచి మేధావుల వరకు ఆయన తన మాటలతో బోల్తా కొట్టిస్తేరట. ఇంతకీ ఆయన ఎవరా అనేనా మీ సందేహం అక్కడికే వచ్చేద్దాం. అంతేకాదు, అలా ఎవరు చెప్పారా అనేనా మీ అనుమానం.. అది కూడా చెప్పేద్దాం.
విషయంలోకి వెళ్తే.. ఏపీ సీఎం చంద్రబాబే నని తేలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎం గా ఉన్న సమయం నుంచి ప్రస్తుతం 13 జిల్లాలకు సీఎంగా ఉన్న ఆయన చెప్పేవన్నీ అందమైన అబద్ధాలే అంటున్నారు సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు. ఎంతో కనస్ట్రక్టివ్‌గా మాట్లాడే కేవీపీ.. విషయం లేకుండా బాబుపై ఎక్కేస్తారా? చెప్పండి. అక్కడికే వద్దాం. ఇటీవల కాలంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు విషయంలో లేనిపోని అంశాలను ప్రచారం చేసుకుంటున్నారు. తనను తానే అపర భగీరథునిగా ప్రచారం చేసుకుంటున్నారు. తాను లేకపోతే.. పోలవరం అంగుళం కూడా కదిలేదికాదని అంటున్నారు.
అయితే, ఇదంతా నిజమేనని, చంద్రబాబు లేకపోతే.. పోలవరం లేదని నమ్ముతున్న వాళ్లకు కేవీపీ చురకలంటించారు. పోలవరం చరిత్ర తెలిసినవాళ్లకి బాబు చేస్తున్న ప్రచారంలో పస ఎంతో తెలిసి పోతుందని అంటున్నారు. అంతేకాదు, ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదని, అయినా కూడా చంద్రబాబు 2019 నాటికి దీనిని పూర్తి చేస్తానని, నీళ్లు రప్పిస్తానని డంబాలు పలుకుతూ అందరినీ నమ్మిస్తున్నారని విమర్శించారు. దేశంలో అందమైన అబద్ధాలు చెప్పగలిగిన నేతలు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం చంద్రబాబు మాత్రమేనని కేవీపీ చడా మడా ఎక్కేశారు.
అంతేకాదు, 2004కు ముందు పోలవరానికి అడ్డుపడింది చంద్రబాబే అని, ఈ ప్రాజెక్టు విషయంలో ఆయన చేసింది శూన్యమని విమర్శించారు. చంద్రబాబు తనకు ఉన్న ఆర్థికశాస్త్రంలో ప్రావీణ్యతను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తే మంచిదని, అబద్ధాలను అందంగా చెప్పగలిగే తెలివితేటలు ఆయన సొంతమంటూ కేవీపీ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని తనపై దుష్ప్రచారం చేయడం తగదని, ఆ ఆరోపణలు కనుక నిరూపిస్తే, రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని కేవీపీ సవాల్ విసిరారు. మరి.. చంద్రబాబు ఈ సవాలును స్వీకరిస్తారో లేదో చూడాలి.