Begin typing your search above and press return to search.
బాబు నుంచి నేర్చుకునేంత ఖర్మ నాకు పట్టలేదు
By: Tupaki Desk | 13 Feb 2019 12:40 PM GMTప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న ఉద్యమాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ మూడేళ్ల కిందటే నిర్వహించిందని గుర్తుచేశారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఢిల్లీలో ఉద్యమం చేసింది మహానుభావా. ఒక్కసారి చరిత్ర చూసుకోండి. ఇంకా చెప్పాలంటే 13-03-2016న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడి నాయకత్వంలో రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేశారు. మీరు ఈరోజు కళ్లు తెరిచారు. పోరాటాలు - ఏపీ ప్రయోజనాల గురించి మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు."
అసలు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కేవీపీ. అలాంటి తన ఆత్మశుద్ధిని శంకించడానికి చంద్రబాబు ఎవరంటూ మండిపడ్డారు. "ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని 23-05-2016న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదం ఇది. మీరు చేసిన మట్టి కుండల ప్రదర్శన 2016 మార్చిలోనే ఏపీ కాంగ్రెస్ నిర్వహించింది. నా ఆత్మశుద్ధినా మీరు శంకించేది. ఏపీ ప్రజలకు నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు."
ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ సాక్షిగా తను చేసిన పోరాటం జాతీయ - అంతర్జాతీయ మీడియాల్లో కూడా వచ్చిందని - ఇప్పుడు కొత్తగా చంద్రబాబు ఓవరాక్షన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు కేవీపీ. తాజాగా మరోసారి సోలోగా పార్లమెంట్ ఆవరణలో దీక్షకు దిగారు కేవీపీ.