Begin typing your search above and press return to search.
టీడీపీ నేతల దీక్షలో కేవీపీ హల్ చల్
By: Tupaki Desk | 18 Dec 2018 3:11 PM GMTఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు సంచలన పరిణామాలతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ నేతగా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడే ఆయన తాజాగా తెలుగుదేశం క్యాంప్ లో కనిపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అంటూ పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దీక్షకు దిగారు. ఆయనకు తోడుగా టీడీపీ రథసారథి - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సన్నిహిత ఎంపీ అయిన మురళీమోహన్ సైతం దీక్ష చేపట్టారు. అయితే, దీనికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు మద్దతు తెలిపారు.
విభజన హామీలను తక్షణమే నెరవేర్చాలని...ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట దీక్షకు దిగిన టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు - మురళీమోహన్ దీక్షకు దిగారు. తన పుట్టినరోజు సందర్భంగా మోడీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యేక హోదానే కావాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీ చంద్రబాబు నాయుడు తనకు స్ఫూర్తి అని చెప్పిన రామ్మోహన్ నాయుడు.. మూడు రాష్టాల్లో బీజేపీ ఓటమి తమ నిరసనల ప్రభావమేనన్నారు. రైల్వే జోన్ పై మాట దాటవేస్తున్న ప్రభుత్వం వెంటనే స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా టీడీపీ ఎంపీల దీక్షకు సంఘీభావం తెలిపారు. కాగా, టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు - మురళీమోహన్ కు టీడీపీ ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.