Begin typing your search above and press return to search.

దమ్ముంటే అందరినీ సస్పెండ్ చేయండి!

By:  Tupaki Desk   |   7 Feb 2018 8:31 AM GMT
దమ్ముంటే అందరినీ సస్పెండ్ చేయండి!
X
కాంగ్రెస్ పార్టీ వారికి అచ్చమైన ప్రతిపక్షం. తెలుగుదేశం పార్టీతో వారి అనుబంధం అధికారికంగా కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ అంటే అవ్యాజమైన అనురాగం ఉంది. ఆ పార్టీ బలం భవిష్యత్తులో అయినా తమకు ఉపయోగపడుతుందేమోననే ఆశ ఉంది.….. ఇలాంటి రకరకాల లెక్కల మధ్య...

కేంద్రంలోని మోడీ సర్కారు పక్షపాత బుద్ధులు అచ్చంగా బుధవారం నాడు బయటపడ్డాయి. రాజ్యసభలో ఒకటోరోజు నుంచి ఒకే రీతిగా నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావును ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అన్ని పార్టీల - అందరు ఎంపీలు సమానంగా నిరసనలు తెలియజేస్తున్నప్పుడు.. కాంగ్రెస్ కు చెందిన ఒక్క కేవీపీని మాత్రమే ఎందుకు సస్పెండ్ చేసినట్లు? అధికార పార్టీ భాజపా - మోడీ దళం తమ కురచ బుద్ధులను బయటపెట్టుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ కుచెందిన ఎంపీలు అందరినీ సస్పెండ్ చేయాలని ప్రజలు అంటున్నారు.

బహుశా మోడీ సర్కారు గద్దె ఎక్కిన తర్వాత - ఎన్నడూ ఏ అంశం మీద కూడా జరగనంత దారుణంగా ఈ సారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అటు లోక్ సభ, ఇటు రాజ్యసభల్లో ఏపీ సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ - తెలుగుదేశం సభ్యులు కొనసాగిస్తున్నారు. సభ్యులందరి ప్రసంగాలకు వారు అడ్డుపడుతూనే ఉన్నారు. ఒక దశలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. మీదంతా చిన్న పిల్లల ఆటల్లా ఉన్నదంటూ కోపగించుకోవడం కూడా జరిగింది. మీరు చిన్న పిల్లల్లా చేస్తున్నారు. సభలో ఇలా చేస్తే ఇళ్లకువెళ్లాక మీపిల్లలకు కూడా ఎలాంటి డిసిప్లిన్ నేర్పలేరు అని ఆమె అన్నారు. కానీ సభ్యుల తెదేపా - వైసీపీ సస్పెన్షన్ కు మాత్రం సాహసించలేదు.

అదే సమయంలో రాజ్యసభలో కేవీపీ చేస్తున్న నిరసన పూర్తిగా మౌనంగా సాగుతోంది. ఆయన ప్లకార్డు పట్టుకుని వెల్ లో నిల్చోవడం తప్ప మరేమీ చేయడం లేదు. మిత్రులను, ఆప్తులను ఏమీ చేయలేని మోడీ సర్కారుకు కేవీపీ నిరసన మాత్రం అసహనం కలిగించింది. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయడం చాలాహేయమైన చర్య అని, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే నిరసనలు చెబుతున్న అందరినీ సస్పెండ్ చేసి ఉండాల్సిందని అంటున్నారు.