Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీకి కేవీపీ కొరియర్..
By: Tupaki Desk | 18 March 2016 6:43 AM GMTప్రధానమంత్రి మోడీని కలవటం అంత తేలికైన విషయం కాదు. తనకు నచ్చని వ్యక్తులకు అపాయింట్ మెంట్ ఇవ్వటానికి ఆయన ససేమిరా అంటారు. అక్కడెక్కడో లండన్ లోని మైనపు బొమ్మలు పెట్టే సంస్థ.. తన ఇంటికి వచ్చి కొలతలు తీసుకోవటానికి సమయం ఇచ్చే మోడీ.. తనను కలిసి తమ రాష్ట్ర సమస్యల్ని చెప్పుకోవటానికి ప్రయత్నించిన ఏపీ కాంగ్రెస్ నేతలకు సమయం ఇవ్వని పరిస్థితి నెలకొంది.
పలుసార్లు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం విఫలయత్నం చేసిన ఏపీ నేతలు.. తమ వేదనను మోడీకి తెలిపేందుకు వీలుగా.. భారీ కొరియర్ ఒకటి పంపారు. విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ కోటి సంతకాల్ని సేకరించింది. వీటిని ప్రధాని మోడీ ఇవ్వటం ద్వారా ఆంధ్రుల మాటను మోడీకి నేరుగా తెలపాలని ప్రయత్నించింది.
అయితే.. అందుకు మోడీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవటంతో.. తాము సేకరించిన కోటి మూడు సంతకాల పత్రాల్ని ప్రధానికి పంపేందుకు ఏపీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఒక ఐడియా వేశారు. అందులో భాగంగా తాము సేకరించిన సంతకాల పత్రాల్ని పెట్టెల్లో ప్యాక్ చేయించి.. దాన్ని ప్రధాని నివాసానికి కొరియర్ పంపారు. కోటి ముగ్గురి ఆంధ్రుల ఆకాంక్ష కొరియర్ రూపంలో మారి.. ప్రధాని ఇంటికి వెళ్లింది. మరి.. మోడీ వాటి వంక చేసే ఛాన్స్ అయినా ఉంటుందా?