Begin typing your search above and press return to search.

ఏపీలో మ‌న సంగ‌తేంది ర‌మ‌ణ‌?

By:  Tupaki Desk   |   28 July 2015 9:26 AM GMT
ఏపీలో మ‌న సంగ‌తేంది ర‌మ‌ణ‌?
X
విమ‌ర్శించ‌టం రాజ‌కీయ‌నాయకుడి జ‌న్మ‌హ‌క్కులా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో విరుచుకుప‌డ‌టం బాగానే ఉంటుంది. కానీ.. మాట్లాడే మాట‌లు కాస్తంత న్యాయంగా ఉన్నా బాగుంటుంది. అంతేకానీ.. తిట్టాలంటే తిట్టాల‌న్న‌ట్లుగా.. విమ‌ర్శించాల‌నే ధోర‌ణి త‌ప్పించి.. మ‌రో ఉద్దేశ్యం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం స‌రికాదు.

తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ వ్యాఖ్య‌లు ఇదే తీరులో ఉన్నాయి. ఏపీలో అధికార‌ప‌క్షంలో ఉన్న త‌మ పార్టీ విధానాల్లోని లోపాల్ని అస్స‌లు ప‌ట్టించుకోకుండా.. విప‌క్షంగా ఉన్న తెలంగాణ‌లోని స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయ‌టం చూసిన‌ప్పుడు గురివింద సామెత గుర్తుకు రాక మాన‌దు.

ఏ విష‌యం మీద అయితే మాట్లాడ‌కూడ‌దో.. అదే విష‌యంపై మాట్లాడిన ర‌మ‌ణ వ్యాఖ్య‌లు కొత్త విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. రైతుల రుణ‌మాఫీ విష‌యంలో పోలిస్తే.. ఏపీతో పోలిస్తే తెలంగాణ బాగా అమ‌లు జ‌రిగింద‌న్న మాట ప్ర‌తిఒక్క‌రి నోట వినిపిస్తుంది. తెలంగాణ‌లోని మిగులు బ‌డ్జెట్‌.. ఏపీలోని లోటు పుణ్య‌మా అని అలాంటి ప‌రిస్థిత‌ని స‌ర్ది చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది.

త‌ల తోక లేని నిబంధ‌న‌లు పెట్టి.. వీలైనంత‌వ‌ర‌కు ల‌బ్ధిదారుల సంఖ్య‌ను త‌గ్గించే అంశం మీద‌నే ఏపీ స‌ర్కారు దృష్టి పెట్టింద‌న్న విమ‌ర్శ ఉంద‌న్న విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. రుణ‌మాపీ ఎపిసోడ్ లో ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఇచ్చిన హామీకి.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అమ‌లు చేసిన రుణ‌మాఫీ విధానానికి అస్స‌లు పోలికే లేద‌న్న విష‌యం తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ.. తెలంగాణ‌లో జ‌రిగిన రుణ‌మాఫీ తీరుపై తెలంగాణ అధికార‌ప‌క్షంపై ర‌మ‌ణ విమ‌ర్శ‌లు చేయ‌టం విశేషం. ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ ఎస్ స‌ర్కారు రుణ‌మాఫీ చేస్తాన‌ని ప్ర‌క‌టించి.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాయిదాల రూపంలో అమ‌లు చేస్తున్నార‌ని.. అది కూడా స‌రిగా జ‌ర‌గ‌టం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ‌ను దివాళా బాట ప‌ట్టించార‌ని విమ‌ర్శించారు.

తెలంగాణ‌లో వాయిదాల ప్ర‌కార‌మైనా ఇస్తున్నారు. కానీ.. ఆంధ్రాలో రుణ‌మాఫీ విష‌యంలో ఇష్టారాజ్యంగా నిబంధ‌న‌లుపెట్టి.. మొత్తంగా గుండు సున్నా చేశార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే.. మాట్లాడే అంశం మీద ర‌మ‌ణ మ‌రికాస్త క‌స‌ర‌త్తు చేస్తే బాగుంటుందేమో.