Begin typing your search above and press return to search.
'కేసీఆర్ ప్యాంటు - షర్టు ఊడదీసి కొడతాం'
By: Tupaki Desk | 5 Oct 2018 4:36 AM GMTతమ అధినేత.. ఆరాధ్య దైవం టీడీపీ జాతీయ అధ్యక్షుడు కమ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మాటలకు రెట్టింపు ఆవేశాన్ని.. అంతకు మించిన మసాలాను దట్టించి మరీ విరుచుకుపడుతున్నారు.
తెలంగాణను చంద్రబాబు నాశనం చేశారంటూ మండిపడిన కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ టీడీపీ నేతలు మాట్లాడుతూ.. 2004లో కాంగ్రెస్ తో.. 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ ఎవరి కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
హుస్నాబాద్ సభ తర్వాత పాతిక రోజులకు బయటకు వచ్చిన కేసీఆర్ కు మతి భ్రమించిందని.. నిజామాబాద్ సభలో అడ్డదిడ్డంగా మాట్లాడారంటూ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తప్పు పట్టారు. బాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని.. లేదంటే ఆయన్ను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
2009 ఎన్నికల వేళ.. టీడీపీతో పొత్తుకు పెట్టుకున్న కేసీఆర్.. చంద్రబాబును ఏ విధంగా పొగిడారో వీడియో టేపుల్ని ప్రదర్శించారు. చంద్రబాబుకు సంపద సృష్టించటం తెలుసని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేశారని.. ఇప్పుడేమో అడ్డగోలుగా మాట్లాడటం ఏమిటని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని 2014లో సోనియా కాళ్లకు మొక్కిన కేసీఆర్.. ఆ తర్వాతి కాలంలో రాక్షసిగా వ్యాఖ్యానించారని.. కేసీఆర్ ద్వంద నీతిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడినా చెల్లిందని.. ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకవన్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారన్న రమణ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ దుర్మార్గ పాలనకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే మహాకూటమికి అంకురార్పణ చేశామన్నారు. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో.. కేసీఆర్ ఫ్యాంటు.. షర్టు ఊడదీసి కొడతామని వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది.