Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లో చేరనంటున్న‌టీడీపీ సీనియ‌ర్‌

By:  Tupaki Desk   |   15 Feb 2017 3:11 PM GMT
టీఆర్ ఎస్‌ లో చేరనంటున్న‌టీడీపీ సీనియ‌ర్‌
X
తెలంగాణ‌ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్నప్ప‌టికీ ఆ పార్టీ కార్య‌క్ర‌మాల కంటే టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నార‌నే ప్ర‌చారం ద్వారా ఎక్కువగా వార్త‌ల్లో నిలిచే మాజీ ఎంపీ ఎల్‌.ర‌మణ త‌న పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. టౌన్ అధ్యక్షుడు నుంచి రాష్ట్ర అధ్యక్షున్ని చేసిన తెలుగుదేశం పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటాన‌ని తెలిపారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పార్టీని వీడనని ర‌మ‌ణ ప్ర‌క‌టించారు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడైన ఎన్టీఆర్ స్పూర్తితో ప్ర‌స్తుత ర‌థ‌సార‌థి చంద్రబాబు నాయుడు సహకారంతో టీడీపీ పూర్వ వైభవం తెస్తాన‌ని రమణ ప్ర‌క‌టించారు. త‌న రాజకీయ జీవితంలో ఎవరితోనూ రహస్య భేటీలు లేవని, అందరితోనూ ఒకేలా ఉంటాన‌ని రమణ వివ‌రించారు.

కాగా, ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయ‌న‌తో ర‌మ‌ణ స‌మావేశం అయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. సుదీర్ఘ‌కాలంగా టీడీపీలో ఉండి టీఆర్ఎస్‌లో చేరిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో క‌లిసి ఈ భేటీ జ‌రిపిన‌ట్లు తెర‌మీద‌కు వ‌చ్చింది. అంతేకాకుండా అనంత‌రం సైతం ఎర్ర‌బెల్లి ఇంట్లో ర‌మ‌ణ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యార‌ని, ఆయ‌న‌కు పెద్ద ప‌ద‌వి ఇచ్చేందుకు టీఆర్ఎస్ వ‌ర్గాలు అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు గుప్పుమ‌న్నాయి. కాగా ఇటీవ‌లే టీడీపీతో పొత్తుకు టీఆర్ ఎస్ ను ఒప్పించ‌డంలో ర‌మ‌ణ కీల‌క పాత్ర వ‌హించార‌ని ప్ర‌చారం సాగింది. ఈ క్ర‌మంలో ర‌మ‌ణ మీడియాతో మాట్లాడుతూ ఈ మేర‌కు వివ‌రణ ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/