Begin typing your search above and press return to search.

ర‌మ‌ణ పార్టీకి రాజీనామా చేసిన వెంట‌నే ఎన్టీఆర్ భ‌వ‌న్ ముందు ట‌పాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు

By:  Tupaki Desk   |   9 July 2021 2:44 PM GMT
ర‌మ‌ణ పార్టీకి రాజీనామా చేసిన వెంట‌నే ఎన్టీఆర్ భ‌వ‌న్ ముందు ట‌పాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు
X
తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ రాజీనామా చేశారు. ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌డం లాంచ‌న‌మే కానుంది. మంత్రి ఎర్ర‌బెల్లి దయాక‌ర్ రావుతో క‌లిసి ఆయ‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్లో సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. బీసీ వ‌ర్గానికి చెందిన ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌ను వీడ‌డంతో కేసీఆర్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆ స్థానాన్ని బీసీల్లో బ‌ల‌మైన చేనేత వ‌ర్గానికి చెందిన ఎల్‌. ర‌మ‌ణ‌తో భ‌ర్తీ చేసి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక ర‌మ‌ణకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని కేసీఆర్ హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.2014లో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచే ర‌మ‌ణ టీ టీడీపీ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్నారు. ముఖ్యంగా 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఆయ‌న టిక్కెట్ల కేటాయింపులో కొంత గోల్‌మాల్ చేశార‌ని సొంత పార్టీ నేత‌ల నుంచే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇక చంద్ర‌బాబు తెలంగాణ‌లో పార్టీని వ‌దిలేయ‌డంతో ర‌మ‌ణ‌ను కూడా ప‌ట్టించుకోలేదు. ఇక టీ టీడీపీకి ఎంత మాత్రం భ‌విష్య‌త్తు ఉండే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ర‌మ‌ణ పార్టీని వీడాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నారు. కొద్ది రోజుల నుంచే ఆయన కారెక్కేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్నా మౌనంగా ఉంటున్నారు. ఇక ఈ రోజు ఆయ‌న పార్టీకి రాజీనామా చేయ‌డంతో పాటు కేసీఆర్‌ను క‌లిసి క్లారిటీ ఇచ్చేశారు. విచిత్రం ఏంటంటే ర‌మ‌ణ పార్టీ మార‌డంతో తెలంగాణ టీడీపీ శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. ర‌మ‌ణ పార్టీకి రాజీనామా చేసిన వెంట‌నే ఎన్టీఆర్ భ‌వ‌న్ ముందు ట‌పాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు.

ర‌మ‌ణ పార్టీలో పెద్ద ఐరెన్‌లెగ్ అని... ఈ ఐరెన్‌లెగ్‌ను కేసీఆర్ త‌మ పార్టీలో చేర్చుకుంటున్నార‌ని.. ఏడేళ్లుగా తెలంగాణ తెలుగుదేశంకు ప‌ట్టిన శ‌ని వ‌దిలిపోయింద‌ని టీ టీడీపీ శ్రేణులు ర‌మ‌ణ‌పై ఫైర్ అవుతున్నాయి. నూత‌న నాయ‌క‌త్వంలో తాము తెలంగాణ‌లో టీడీపీని బ‌లోపేతం చేసుకుంటామ‌ని వారు చెపుతున్నారు. ఇక ర‌మ‌ణ కూడా పార్టీని వీడ‌డంతో ఇప్పుడు టీ టీడీపీలో రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అర‌వింద్ కుమార్ గౌడ్‌, ద‌యాక‌ర్ రెడ్డి లాంటి పేర్లు తెలిసిన నేత‌లు మాత్ర‌మే ఉన్నారు. వీరు కూడా త్వ‌ర‌లోనే సైకిల్ దిగేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.