Begin typing your search above and press return to search.
ఆ పార్టీ మద్దతు కోరిన తెలుగు తమ్ముళ్లు ఆ పార్టీకి తోడుగా సారు
By: Tupaki Desk | 2 Oct 2019 12:16 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు హుజూర్ నగర్ వైపు. తెలంగాణ రాజకీయ పరిణామాల్ని మార్చే అవకాశం ఉన్న ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంట అంతకంతకూ పెరుగుతోంది.
కేసీఆర్ నిరంకుశ వైఖరిని తెలంగాణ సమాజం ఎండగట్టాలని పేర్కొన్నారు. సొంతంగా నిలబడలేని సారు.. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వటం ద్వారా ఫలితాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తారో ఎన్నికల ఫలితాలు వెల్లడైతే కానీ అర్థం కాదని చెప్పక తప్పదు.
రికార్డుస్థాయిలో నామినేషన్లు దాఖలు చేసినప్పటికి.. నామినేషన్ల పరిశీలనలో రిజెక్ట్ కావటం.. కేవలం 31 మంది అభ్యర్థులు మిగలటం తెలిసిందే. వీరిలో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండటంతో బరిలో ఉండేది ఎంతమంది? వెనక్కి తగ్గేది ఎంతమంది? అన్నది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే.. నామినేషన్ వేసి.. ఎన్నికల అధికారులు రిజెక్ట్ చేయటంతో సీపీఎం అభ్యర్థి బరి నుంచి బయటకు వచ్చేసిన దుస్థితి.
ఇలాంటివేళ.. సీపీఎం మద్దతును కోరుతున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎల్.రమణ. సీపీఎం బరిలో లేని నేపథ్యంలో తమకు మద్దతు ఇవ్వాలని సీపీఎం నేత తమ్మినేనితో ఫోన్లో మాట్లాడారు రమణ. దీంతో.. తమ పార్టీలో మాట్లాడుకొని తుది నిర్ణయం చెబుతామన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉనికి లేని టీడీపీకి.. సీపీఎం మద్దతు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే అంతకు మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదంటున్నారు. మరి.. కామ్రేడ్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోదండం సారు చీఫ్ గా ఉన్న టీజేఎస్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కోదండం మాష్టారు మాట్లాడుతూ.. తాజా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తాము డిసైడ్ అయినట్లుగా చెప్పారు. టీఆర్ ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలన్న ఉద్దేశంతోతామీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన చెబుతున్నారు.