Begin typing your search above and press return to search.
అత్తగారి బలంతో రంగంలోకి దిగుతారా?
By: Tupaki Desk | 1 Nov 2017 1:30 AM GMTకొడంగల్ ఉప ఎన్నిక రాగానే రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరుతాం అని తెలుగుదేశం పార్టీ భీషణ ప్రతిజ్ఞలు చేస్తోంది. అయితే.. ఆ పార్టీ తరఫున అక్కడ పోటీచేసేది ఎవ్వరు? అయితే నాయకుల మాటల్లో కొన్ని సంకేతాలను గమనించినప్పుడు గానీ.. పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం బట్టి గానీ.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ కొడంగల్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నదని కూడా అనుకుంటున్నారు. రమణకు ఆ నియోజకవర్గంలో అత్తగారి ఊరు ఉంది. వారి పరంగా మంది బలం కూడా ఉంది. ఆ అత్తగారి బలాన్ని నమ్ముకుని ఆయన రంగంలోకి దిగే అవకాశం ఉన్నదనే ప్రచారం జరుగుతోంది.
రేవంత్ రెడ్డి పోక - ఉప ఎన్నిక గురించి రమణ చాలా టెక్నికల్ గా పాలిట్ బ్యూరో సమావేశం తర్వాత మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ ను ఓడిస్తాం అన్నారే తప్ప.. తాము గెలుస్తాం అనలేదు. అదే ఉప ఎన్నిక ఆలస్యం అయితే గనుక.. మార్చి 29 నాడు నిర్వహించే ప్రజాబ్యాలెట్ లో మాత్రం తెరాస - కాంగ్రెస్ లకంటె తాము ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటాం అన్నారే తప్ప.. ఎన్నికల్లో ఎక్కువ తెచ్చుకోగలం అనలేదు.
అలాగే.. ఆ నియోజకవర్గం తనకు అత్తగారి నియోజకవర్గం అవుతుందని, అక్కడ తనకు చాలా బలం ఉన్నదని, ఆ బలాన్ని పరిచయాల్ని ఉపయోగించి.. రేవంత్ ను ఓడగొట్టగలం అని పార్టీ అధ్యక్షుడు రమణ చెబుతున్నారు. చూడబోతే ఈ బలాన్ని నమ్ముకుని ఆయనే రంగంలోకి దిగే అవకాశమూ ఉన్నదని వినిపిస్తోంది. ఎందుకంటే.. రేవంత్ కు వ్యతిరేకంగా రంగంలోకి దిగడానికి ఇప్పటికిప్పుడు కొంతైనా బలం ఉన్న నాయకులు తెదేపాకు దొరక్కపోవచ్చు. అంతకంటె బలహీనమైన నాయకులు ఉన్నా.. వారు పోటీచేయగలిగే స్థితిలో ఉండరు. పోటీకి దింపినా.. పార్టీ పరువుపోయేంత కామెడీ అవుతుంది. ఇలాంటి సంక్లిష్టత వల్ల నేరుగా రమణే బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదని పలువురు అనుకుంటున్నారు. రమణ పేరుకు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారే తప్ప.. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వంటి పదవులేమీ లేవు. ఆ నేపథ్యంలో అదృష్టం కలిసివస్తుందనే ఆశతో రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదు. అయితే ఆయనకు ఆశ ఉండడం తప్పు కాదు గానీ.. అదృష్టం వరిస్తుందా లేదా అనుమానమే.