Begin typing your search above and press return to search.
మరో ‘టీ’ అధ్యక్షుడు జంప్..?
By: Tupaki Desk | 11 May 2016 4:43 AM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుందా? ఏపీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కరెంటు షాక్ లాంటి షాక్ మరొకటి తగలనుందా? మొన్నామధ్య వైఎస్ జగన్ కు ఏ తీరులో అయితే తెలంగాణ అధికారపక్షం చేతిలో పంచ్ పడిందో అదే తరహా పంచ్ ఈసారి చంద్రబాబుకు పడనుందా?అంటే అవునని చెబుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణను కారెక్కించే పనిలో గులాబీ దళం బిజీగా ఉందంటున్నారు. రమణను సైకిల్ నుంచి దించేసి కారులో ఎక్కించే కార్యక్రమం మా జోరుగా సాగుతుందని.. ఇందులో భాగంగా ఇప్పటికే లంచ్ మీటింగ్ లు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.
అధికారంలో లేకపోవటం.. రోజులు గడిచే కొద్దీ బలహీనంగా మారుతున్న పార్టీతో ఒరిగేదేమీ ఉండదన్న ప్రచారంతో రమణ కారు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. అధినేత తనకు ప్రాధాన్యత ఇచ్చినా.. పవర్ లేకుండా ఎన్నాళ్లు ఉండాలన్నఆవేదనను ఆయన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో టీఆర్ ఎస్ ఓటమిపాలు కావటం.. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి పాగా వేసిన నేపథ్యంలో.. ఆయన్ను చెక్ చెప్పేందుకు తనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఆశలో రమణ ఉన్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే లభించిన హామీ ఆయన్ను కారు ఎక్కే అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. ఇతర పార్టీ నేతల్ని సమర్థంగా పార్టీలోకి తీసుకొచ్చే సత్తా ఉన్న మంత్రి కమ్ మేనల్లుడు హరీశ్ ఇప్పుటికే ఆ పనిలో పురోగతి సాధించినట్లుగా సమాచారం. ఇప్పటివరకూ అంచనాలుగా ఉన్న రమణ జంపింగ్ కానీ వాస్తవ రూపం దాల్చిన పక్షంలో తెలంగాణలోని మరో పార్టీ అధినేత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు అవుతుంది. ఈ పరిణామం చంద్రబాబును తీవ్రంగా ఇబ్బంది పెట్టటం ఖాయమని చెప్పక తప్పదు.