Begin typing your search above and press return to search.
కశ్మీర్లో ఆందోళన.. లడఖ్ లో సంబరం.. కన్నీటికథ
By: Tupaki Desk | 6 Aug 2019 10:12 AM GMTకేంద్రంలోని బీజేపీ చారిత్రిక నిర్ణయం తీసుకుంది. రావణకాష్టంలా రగిలే జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ.. ఆ రాష్ట్రాన్ని విభజించి లఢఖ్- జమ్మూకశ్మీర్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేసింది. అయితే కశ్మీర్ లో దీనిపై వేర్పాటువాదులు- ముస్లింలు ఆందోళనలతో అట్టుడికిస్తున్నారు. ఆశ్చర్యకరంగా లడఖ్ లో మాత్రం ఆ ఎంపీ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సోమవారం సంబరాలు జరుపుకున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
కశ్మీర్ ఎంపీలు, నేతలు ఈ బిల్లును వ్యతిరేకించగా.. లడఖ్ ఎంపీ మాత్రం హర్షం వ్యక్తం చేసి బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి లడఖ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ఆ మార్చి ఆ ప్రాంతానికి కేంద్రం ఊపిరిలూదిందనే చెప్పాలి. లడఖ్ కన్నీటి కథ తెలిసిన వారంతా ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పాటును సంబరంగా జరుపుకుంటుండడం విశేషం.
*లడఖ్ చరిత్ర ఏంటి?
లడఖ్ ప్రాంతం జమ్మూకశ్మీర్ వైశాల్యంలో 40శాతం ఉంటుంది. టిబెట్ బార్డర్ కు ఆనుకొని హిమాలయ సానువుల్లో ఉంటుంది. లడఖ్ రెండు జిల్లాలుగా ఉంది. అది కార్గిల్, రెండో లేహ్. లేహ్ ప్రాంతంలో బౌద్దులు అధికంగా ఉంటారు. వీరు మాట్లాడే భాష కూడా టిబెటన్లకు దగ్గరగా ఉండే లాదాఖీ. కశ్మీరీలకు , లడఖ్ వాసులకు సాంస్కృతికంగా బాగా తేడా.. పూర్తి భిన్నం కూడా. కశ్మీరీలు ఎక్కువగా ముస్లిం, పండింట్ లు కాగా.. లడఖ్ వాసులు బౌద్దులు. అయితే నాటి కశ్మీర్ రాజు హరిసింగ్ కశ్మీర్ ను భారత్ లో కలపడంతో వీరు ప్రత్యేకత కోల్పోయి జమ్మూకశ్మీర్ లో భాగమై అష్టకష్టాలు పడ్డారు. 1947లో పాకిస్తాన్ ప్రేరేపిత దాడులతో లడఖ్ సర్వస్వం కోల్పోయింది. ఆర్థికంగా దోపిడీకి గురై హిమాచల్ ప్రదేశ్ కు వలసవెల్లారు. అక్కడ బిక్షగాళ్లు గా మారారు. ఉన్న వాళ్లను ఉగ్రవాద ముసుగులో చంపేశారు. దోచుకున్నారు.
ఇక కశ్మీర్ ప్రభుత్వంలో మొత్తం నిధులు, అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ కే వచ్చి లడఖ్ ప్రాంతాన్ని పూర్తి విస్మరించారు నాటి పాలకులు. కశ్మీర్ అధికారుల చేతుల్లో వీరు దోపిడీకి గురయ్యారు. లడఖ్ ప్రాంతం గురించి ఇప్పటికీ పట్టించుకునే వారు లేరు. దీనిపై అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటారు. లడఖ్ భాషను కూడా తోసిరాజని ఇక్కడ ఉర్ధూను అమలు చేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కశ్మీరీల చేతుల్లో లఢక్ వాసులు ఇన్నాళ్లు దోపిడీకి గురయ్యారు. అందుకే లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించగానే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలందరూ రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకొని తమ సంతోషాన్ని చాటారు.