Begin typing your search above and press return to search.
ట్రెండింగ్: పెళ్లికి ‘పిల్ల’ కొరత
By: Tupaki Desk | 29 Jun 2019 5:30 PM GMT''కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ బ్రాహ్మణ కులానికి చెందిన అబ్బాయి.. గుడిలో పౌరహిత్యం చేస్తూనే ప్రైవేటు కంపెనీలో 25వేల జీతానికి పనిచేస్తున్నాడు. వీరిది సాదాసీదా కుటుంబం.. ఆస్తుపాస్తులేం లేవు. పెళ్లీడుకొచ్చి ముదిరిపోయాడు. వయసు 35 దాటిపోయింది. బ్రాహ్మణ కులంలో తీవ్రంగా అమ్మాయిల కొరత ఉంది. దీంతో బడా ఆస్తులన్న వారు అమ్మాయిల తల్లిదండ్రులను ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి ఖర్చు భరించి అమ్మాయిలను చేసుకుపోతున్నారు. సాధారణ యువకులకు అస్సలు పెళ్లే కావడం లేదు. దీంతో సదురు యువకుడు ఓ అనాథ శరణాలయంలో యువతిని చూసుకొని ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు..ఈ వార్త వైరల్ గానూ మారింది..''
''వరంగల్ జిల్లాకు చెందిన వైశ్య సామాజికవర్గ ఓ వీఆర్వో యువకుడిదీ ఇదే పరిస్థితి. తల్లిదండ్రీ లేని ఆ యువకుడు కష్టపడి పైకొచ్చాడు. కానీ బ్యాక్ గ్రౌండ్ లేక ఇతడికి పిల్లనివ్వడం లేదు. పైగా వైశ్య సామాజికవర్గంలో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉంది. 2 లక్షల చొప్పున కన్యాశుల్యం ఇచ్చి మీరీ అందులోని అమ్మాయిలను పెళ్లి ఖర్చు భరించి చేసుకుంటున్నారు. దీంతో మన వైశ్య వీఆర్వో తనకు పరిచయమైన కాపు సామాజికవర్గ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు..''
ఈ రెండు యాథార్థగాథలే.. ఈ బాధ వీరిద్దరిదే కాదు.. ప్రస్తుతం సమాజంలో అందరినీ కలవరపెడుతున్న అతిపెద్ద సమస్యగా మారింది. సామాజికంగా అగ్రకులాలైన బ్రాహ్మణ- వైశ్య సామాజికవర్గాల్లో ఇప్పుడు అమ్మాయిల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వీటిల్లో స్త్రీ-పురుష నిష్పత్తి 550: 1000గా ఉందట.. ఆ రెండు కులాల్లో బాగా డబ్బున్న అబ్బాయిలకు తప్పితే సాధారణ వారికి అసలు పిల్లనే ఇవ్వడం లేదు. కన్యాశుల్యం ఈ రెండు సామాజికవర్గాల్లో మొదలైంది. అమ్మాయి ఉంటే డబ్బులు, పెళ్లి ఖర్చు భరించి మరీ చేసుకుంటున్న పరిస్థితి దాపురించింది. ఇవే కాదు.. కొన్ని బీసీ సామాజికవర్గాలు, అరుదైన కులాల్లో, కొన్ని అగ్రవర్ణాల్లోనూ అమ్మాయిల కొరత తీవ్రంగా వేధిస్తోంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో నిజంగా అన్ని కులాల్లో కన్యాశుల్యం రావచ్చని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లికాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. వాళ్లకు సరిపడే అమ్మాయిల కొరత కొన్ని కులాల్లో తీవ్రంగా ఉంది. రెండు మూడు సామాజికవర్గాల్లో మొదలైన కన్యాశుల్యం ఒరవడి.. మరికొన్నేళ్లు గడిస్తే అన్నింట్లోనూ వచ్చేపరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు గుండెల మీద బరువు అనుకునే ఆడపిల్లల తల్లిదండ్రులే అమ్మాయి ఉంటే బాగుండు అనేలా పరిస్థితి మారొచ్చు అంటున్నారు.