Begin typing your search above and press return to search.
డ్రంకెన్ డ్రైవ్ లో రికార్డు రీడింగ్
By: Tupaki Desk | 12 Nov 2018 10:52 AM GMTపొగతాగనివాడు దున్నపోతై పుట్టును అన్నాడు గిరీషం.. మందు తాగని వాడు గాడిదై పుట్టును అంటున్నారు మడ్రన్ గిరీషంలు.. ఇప్పుడు హైదరాబాద్ లో సెలెబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ తాగి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోతున్నారు. హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఈ మధ్య యువతులు పట్టు పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం రాత్రి పట్టుబడిన ఆ అమ్మాయి తాగింది చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 45లో గత శనివారం పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాత్రిపూట ఫూటుగా మద్యం తాగి వస్తున్న వారి మద్యం రీడింగ్ ను నమోదు చేస్తున్నారు. జరిమానా విధిస్తున్నారు. ఆ సందర్భంలో అటుగా వచ్చిన ఓ యువతికి రీడింగ్ నమోదు చేసేందుకు ఊదమన్నారు. 536 పాయింట్లు అని చూపడంతో ఆశ్చర్యపోయారు.
సాధారణంగా ఒక బీరు తాగితే 30 నుంచి 35 పాయింట్లు చూపుతుంది. అలాంటిది 500 పాయింట్లు పైబడి చూపడంతో నివ్వెరబోతున్నారు. ఇప్పటికి ఇదే రికార్డు స్థాయి రీడింగ్ అని చెబుతున్నారు. సదరు యువతి నడిపిన కారును సీజ్ చేసి, ఆమెపై కేసు నమోదు చేశారు. కేసు కోర్టుకు బదిలీ చేశారు.