Begin typing your search above and press return to search.

మోసం చేశాడని.. కోసేసిన ఆమెకు కోర్టు ఏం శిక్ష వేసిందంటే?

By:  Tupaki Desk   |   16 Dec 2019 6:47 AM GMT
మోసం చేశాడని.. కోసేసిన ఆమెకు కోర్టు ఏం శిక్ష వేసిందంటే?
X
లవ్ చేయటం.. తర్వాత తప్పించుకొని తిరగటం చాలామందికి మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవం. అలాంటి మోసమే ఎదురైన ఒక వైద్యురాలు తట్టుకోలేకపోయింది. ఊహించని రీతిలో రియాక్ట్ అయిన ఈ ఉదంతం దాదాపు పదకొండేళ్ల క్రితం చోటు చేసుకుంది. 2008లో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ప్రస్తుతం 32 ఏళ్లు ఉన్న ఆమె అప్పట్లో డాక్టర్ గా పని చేసేవారు. డెంటిస్ట్ గా క్లీనిక్ ఉండేది. మైసూర్ కు చెందిన మరో వైద్యుడ్ని ప్రేమించింది.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి ఇళ్లల్లో చెబితే అమ్మాయి ఇంట్లో ఓకే కానీ అబ్బాయి ఇంట్లో ససేమిరా అనేశారు. దీంతో.. ఆమెకు ఆ విషయాన్ని చెప్పలేక ఒక డ్రామా ఆడాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెల తర్వాత ఆమె వద్దకు వచ్చి.. తనకు క్యాన్సర్ అని ఎక్కువ కాలం బతకనని చెప్పాడు. తనను మర్చిపోవాలన్నాడు. దాంతో షాకైన ఆమె.. క్యాన్సర్ అయినా ఫర్లేదని.. పెళ్లి చేసుకుంటే అతడ్నే చేసుకుంటానని చెప్పింది. దీంతో ఏం చేయాలో తెలీని అతడు.. వద్దు వద్దు.. నీ జీవితాన్ని అన్యాయం చేయనంటూ చెప్పి ఆమె నుంచి దూరమైపోయాడు. తర్వాత ఆమెకు అతడు కనిపించలేదు.

కట్ చేస్తే.. ఇంట్లో వాళ్లు చూపించిన అమ్మాయిని పెళ్లాడాడు. హ్యాపీగా ఉన్నాడు. ఇక్కడ ఆమె మాత్రం అతన్ని మర్చిపోలేక రోజూ బాధ పడుతూ బతుకుతోంది. ఇదిలా ఉంటే.. ఒక రోజు అతడు ఒకమ్మాయితో జాలీగా బైక్ మీద వెళ్లటాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆశ్చర్యపోతూ అతడ్ని పలుకరించింది. తనకు క్యాన్సర్ లేదని.. తప్పుడు రిపోర్టుల కారణంగా అలా అయినట్లు చెప్పాడు. ఇంట్లో వారి బలవంతంతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అబద్ధమాడాడు.

అతడు చెబుతున్న మాటల్లో మోసాన్ని గుర్తించిన ఆమె రగిలిపోయింది. అంతకంతకూ బదులు తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. తన క్లినిక్ కు భార్యభర్తలిద్దరిని రమ్మని చెప్పిన ఆమె.. వారికిచ్చిన కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపింది. దాంతో మత్తులోకి జారిపోయిన అతడి మర్మాంగాన్ని కోసేసింది. అక్కడ నుంచి వెళ్లిపోయింది. మత్తు దిగిన తర్వాత తనకు జరిగింది తెలుసుకున్న అతగాడు ఘల్లుమన్నాడు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు.

అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత.. ఎంత మోసం చేస్తే మాత్రం అలాంటి పనులు చేస్తారా? అని ప్రశ్నించిన కోర్టు.. ఆమె చేసిన తప్పు కారణంగా మరో యువతి జీవితం నాశనమైందని.. వారి ప్రేమ విషయం ఆమెకు తెలీదు కదా? అని కోర్టు పేర్కొంది. చేసిన దారుణమైన తప్పునకు మహిళా వైద్యురాలికి పదేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. తనను మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పాలని.. తన జీవితాన్ని కూడా ఆమె నాశనం చేసుకుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఒకరు చేసిన పనికి మోసపోయినా.. దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవాలే కానీ ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. అందుకు ఫలితాన్ని అనుభవించక తప్పదన్నది మర్చిపోకూడదు.