Begin typing your search above and press return to search.

బొడ్డులో తుపాకీ, ట్రాక్టర్ నడుపుతూ లేడీ డాన్

By:  Tupaki Desk   |   23 July 2015 9:51 AM GMT
బొడ్డులో తుపాకీ, ట్రాక్టర్ నడుపుతూ లేడీ డాన్
X
భర్త వృత్తి బాగుంది అనుకుందో లేక అది భర్త వృత్తి కదా... నా ప్రవృత్తిగా మార్చుకుందామని అనుకుందో... అదీకాక కుటుంబ వృత్తిలాగా భావించిందో కానీ... ఒక మహిళ కబ్జాకి పాల్పడింది. అది కూడా తెరవెనక కాదు! అందరి ముందూ బొడ్డులో రివాల్వర్ దరించి మరీ! ఈ విషయం చూసిన వారంతా ముక్కుమీద వేలేసుకుంటుంటే... ఇది కచ్చితంగా అక్కడి ప్రభుత్వం చేతకాని పని అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే... అక్కడ ఇలాంటి సంఘటనలు తొలిసారి కాదు! ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది... ఈ సంఘటనకు వేదిక యూపీ అని!!

దౌర్జన్యాలు, ధమంకాండలు, రౌడీయిజాలు... ఎన్నో ఎనెన్నో ఆ రాష్ట్రంలో నిత్యకృత్యాలు. తాజాగా ఒక మహిళ లేడీ డాన్ గా మారి ఒక చర్చి పక్కన ఉన్న స్థాలాన్ని పట్టపగలు, ఊరిజనాలంతా చూస్తుండగా కబ్జా చేసేందుకు ప్రయత్నించింది. తానే సొంతంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చింది. అదే సమయంలో తూపాకీ పట్టుకుని హల్ చల్ చేస్తూ, దగ్గరికి వచ్చేవారిని బెదిరిస్తూ... ఎవ్వరినీ దగ్గరకు రానివ్వకుండా పంటను నాశనం చేసింది! అయినా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించిన మహిళలపై ట్రాక్టర్ తో గుద్దేసింది. ప్రస్తుతం ఆ మహిళ గాయాలతో చికిత్స పొందుతుంది. అయితే సీన్ చివర్లో వచ్చిన పోలీసులు ఆమెను గౌరవంగా అక్కడినుండి తీసుకువెళ్లారు తప్ప... ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో విషయం ఏంఇటంటే... ఆమె భర్త కూడా ఇదేపనులతో బిజీగా ఉంటుంటాడట!