Begin typing your search above and press return to search.
చెన్నై : పోలీసులకు కరోనా.. స్టేషన్ మూసివేత !
By: Tupaki Desk | 24 April 2020 1:00 PM GMTదేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దేశంలో ఇప్పటికే వైరస్ కేసుల సంఖ్య 23 వేలు దాటినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 12 గంటల్లో 1,377 కేసులు నమోదు కాగా, 32 మంది మరణించారని తెలిపింది. దేశవ్యాప్తంగా 23,077 పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలిపింది. ఇకపోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో వైద్యులు, -పోలీసులు - పారిశుద్ధ్య కార్మికులు - వైద్యులు - ఆశావర్కర్లు నిత్యం కరోనా పాజిటివ్ కేసుల ప్రాంతాల్లోనే విధులు నిర్వహిస్తు న్నారు.
కాగా, తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతోంది. తాజాగా వైరస్ కారణంగా తమిళనాడులోని ఏకంగా ఓ పోలీస్ స్టేషన్ కే తాళాలు వేసిన సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చూస్తే ...ఉమ్మడి వెల్లూర్ లోని ప్రాంతాలలో పోలీసులకు - పలువురు జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించగా…వీరిలో వానియంబడి లోని మహిళ ఇన్ స్పెక్టర్ కి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో వానియంబడి పోలీస్ స్టేషన్ మూసివేసిన అధికారులు - స్టేషన్ సిబ్బంది 37 మందిని - వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి తరలించారు.