Begin typing your search above and press return to search.
హంతకుడికి ముద్దు పెట్టి.. అడ్డంగా బుక్కైన లేడీ జడ్జి..ఎక్కడంటే?
By: Tupaki Desk | 8 Jan 2022 1:30 PM GMTప్రపంచంలో ఏ దేశంలో అయినా.. న్యాయ వ్యవస్థకు ఉండే గౌరవ మర్యాదలు మా గొప్పగా ఉంటాయి. న్యాయమూర్తి స్థానంలో ఉండే వారు చాలా పరిమితుల మధ్య ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అలాంటిది.. ఈ తీరుకు భిన్నంగా.. కలలో కూడా ఊహించలేని రీతిలో.. ఒక హంతకుడ్ని ఒక లేడీ జడ్జి ముద్దుపెట్టుకున్న ఉదంతం ఒకటి పెను దుమారాన్ని రేపింది.
ఇప్పుడా దేశంలో ఇదో ఇష్యూగా మారటమే కాదు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో మారటంతో.. ఆ దేశ సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారంలోకి తలదూరాల్సి వచ్చింది. ఇంతకూ అసలేం జరిగింది? హంతకుడికి లేడీ జడ్జి ఎప్పుడు? ఎక్కడ? ఎలాముద్దు ఇచ్చారు? అసలేం జరిగింది? వీడియో బయటకు వచ్చాక ఏం జరుగుతోంది? అన్న వివరాల్లోకి వెళితే..
అర్జెంటీనాలో చుబూట్ ప్రావిన్స్ లో న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు మారిల్ సురెజ్. ఇక్కడ ఆమె గురించి కాస్తంత చెప్పాలి. ఆమెకు స్త్రీవాది అన్న పేరుంది. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు ఇవ్వాలంటూ పోరాడుతుంటారు. మహిళలకు ఆదర్శంగా ఆమెను చెబుతుంటారు.
అలాంటి ఆమె న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు.. ఒక హత్యకేసులో హంతకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు క్రిస్టియన్ బాయి బుస్టాస్ వచ్చాడు. అతడి మీద ఉన్న హత్యారోపణల విషయానికి వస్తే.. 2009లో లీండ్రో రాబర్ట్స్ అనే పోలీసు అధికారిని కాల్చి చంపాడు. ఎందుకలా? అంటే.. ఇతగాడి మీద అప్పటికే మరో హత్య కేసు నమోదై ఉంది.
అతను తన బాబాయ్ కొడుకును కొట్టి చంపిన కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో భాగంగా జైలుశిక్షను అనుభవిస్తున్న వేళలో.. జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ సందర్భంగా అతన్ని పోలీసులు అడ్డుకోగా.. ఒక పోలీసు అధికారిని కాల్చి చంపాడు. ఇదే ఉదంతంలో పోలీసుఅధికారి సోదరుడు కూడా చనిపోయాడు. దీంతో.. ఇతడిపై తీవ్రమైన హత్యారోపణలు ఉన్నాయి. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మారిల్.. నిందితుడికి అనుకూలంగా ఓటేసి.. తుది తీర్పులో.. అతడికి జీవిత ఖైదును విధించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కేసు విచారణలో హంతకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి.. లేడీ న్యాయమూర్తికి ఎప్పుడు కనెక్టు అయ్యారో కానీ కనెక్టు అయ్యారు. జైల్లో ఉన్న అతడ్ని కలుసుకోవటానికి వెళ్లిన ఆమె.. అక్కడఅతడికి ముద్దు ఇచ్చేసింది. అక్కడే ఉన్న సీసీ కెమేరాలో ఈ ముద్దు వ్యవహారం రికార్డు అయ్యింది. అది కాస్తా బయటకు రావటం.. రచ్చ రచ్చగా మారింది. అత్యంత గౌరవ స్థానంలో ఉన్న మహిళా న్యాయమూర్తి.. ఒక హంతకుడిని ముద్దు పెట్టుకోవటం సంచలనంగా మారింది.
ఆమె వ్యవహరించిన తీరుకు దేశ సుప్రీంకోర్టు కలుగచేసుకొని.. చర్యలు చేపట్టే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.