Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ లో లేడీ ఎంపీ, ఖిరాక్ ఎమ్మెల్యే సమరం!
By: Tupaki Desk | 1 Nov 2019 5:00 AM GMTకరవకంటే పాముకు కోపం.. విడువకు అంటే కప్పకు కోపం ఇలా ఉందట ఇప్పుడు గులాబీ కోటలో కింది స్థాయి నేతలు, కార్యకర్తల పరిస్థితి. ఇప్పుడా లేడీ ఎంపీ వర్సెస్ ఖిరాక్ ఎమ్మెల్యే వ్యవహారం టీఆర్ఎస్ లో అందరినోళ్లలో నానుతోంది..
మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఖిర్రాక్ అని అందరికీ తెలిసిందే.. ఆయన అప్పట్లో అధికారులపై చిందులు తొక్కడం.. అది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగడం.. కేసీఆర్, కేటీఆర్ పిలిచి మరీ చీవాట్లు పెట్టి వారికి సారీ చెప్పించడం మీడియాలో హైలెట్ అయిపోయింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లాంటి శంకర్ నాయక్ కు ఇప్పుడు ఆయన శత్రువుగా ఉండి టీఆర్ఎస్ లో చేరిన మహబూబ్ బాద్ ఎంపీ కవితతో తెగని పంచాయితీని పెట్టుకున్నాడట..
టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఆయనకు ప్రత్యర్థిగా మాలోతు కవిత ఉండేవారు. కానీ మారిన పరిస్థితుల్లో కవిత టీఆర్ఎస్ లో చేరి మహబూబాబాద్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఒకఒరలో ఉన్న ఈ రెండు కత్తులు కలహించుకుంటున్నాయి. ఆధిపత్య పోరుతో కింది స్థాయి నేతలకు చుక్కలు చూపిస్తున్నాయట..
నిజానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే టికెట్ కోసమే కవిత, శంకర్ నాయక్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. కేసీఆర్ చివరకు శంకర్ నాయక్ కే టికెట్ ఇచ్చాడు. తనకు పోటీగా రాజకీయం చేసిన కవిత ఎంపీగా గెలిచినా ఆమెతో అంటీముట్టనట్టు ఉంటూ ఆమెకు సన్నిహితంగా ఉండే నేతలు, కార్యకర్తలకు చుక్కలు చూపిస్తున్నాడట శంకర్ నాయక్. ఇక ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండే నేతలకు ఎంపీ కవిత అలానే ట్రీట్ చేస్తున్నారట.
దీంతో ఈ ఇద్దరి నేతలతో ఇప్పుడు మహబూబాబాద్ లో నేతలు హడలి చస్తున్నారట.. ఎంపీ దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరకు పోయినా మీడియాలో ఫోకస్ కాకుండా విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట.. వీరి ఆధిపత్య పోరు తమకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని నేతలు వాపోతున్నారు.