Begin typing your search above and press return to search.

లేడీ సాఫ్ట్ వేర్.. చేసేది 'గంజాయి' దందా

By:  Tupaki Desk   |   1 April 2022 7:30 AM GMT
లేడీ సాఫ్ట్ వేర్.. చేసేది గంజాయి దందా
X
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. గత కొన్నేళ్లుగా డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసుల్లో అరెస్ట్ అవుతున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగినిని నగర పోలీసులు అరెస్ట్ చేశారు.

కొండపనేని మాన్సీ హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీలో ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తున్నారు. ఆమె భర్త మదన్ మనేకర్‌తో కలిసి నాచారం ప్రాంతంలో నివాసం ఉంటోంది.

ఈ జంట అరకు నుంచి గంజాయిని తెప్పించి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం.

మార్చి 12న జరిగిన దాడిలో బోయిన్‌పల్లి పోలీసులు ఈ జంటను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ తృటిలో తప్పించుకున్నారు. అయితే మాన్సీ, మదన్‌లు చిక్కకున్నా.. వారి నుంచి 1.2 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మరో ఇద్దరు యువకులను పట్టుకోగలిగారు. దంపతులు తప్పించుకున్నారు. చివరకు ఆ యువకుల సమాచారంతో పోలీసులు కొంపల్లిలో మాన్సీని అరెస్ట్ చేశారు.

మాన్సీ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని, అయితే ఆమె కుటుంబం ప్రస్తుతం నాగ్‌పూర్‌లో స్థిరపడింది. ఆమె భోపాల్‌లో ఇంజనీరింగ్ చదివింది.

తన ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు మారింది. ఆమె గత మూడేళ్లుగా భర్తతో కలిసి నాచారంలో ఉంటోందని పోలీసులు తెలిపారు. సీక్రెట్ గా ఈ గంజాయి దందా చేస్తోందని సమాచారం.